ఆ వారసుడు ఇపుడైనా హిట్ కొడతాడా


brahmanandam son gautham manu trailer interestingహాస్య బ్రహ్మ గా పేరుగాంచిన బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా పరిచయమయ్యాడు , అయితే మూడు సినిమాలు చేయగా మూడు కూడా ప్లాప్ అయ్యాయి దాంతో చాలారోజుల పాటు సినిమాలు చేయకుండా ఉండిపోయాడు . కట్ చేస్తే కొంతమంది క్రౌడ్ ఫండింగ్ తో సినిమా చేయగా అందులో హీరోగా నటించాడు ఆ చిత్రమే ” మను ” . షార్ట్ ఫిలిమ్స్ తో తన ప్రతిభ ని నిరూపించుకున్న ఫణింద్ర ఈ మను చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు . ఇక ఇటీవలే ట్రైలర్ ని విడుదల చేసారు ఆ ట్రయిలర్ చూస్తే ఆకట్టుకునేలా ఉంది , సినిమాపై అంచనాలు పెంచేలా చేస్తోంది .

తలా కొంత డబ్బు వేసుకొని చేసిన ఈ సినిమాపై గౌతమ్ తో పాటుగా ఆ చిత్రంలో నటించిన వాళ్ళు కూడా ఆశిస్తున్నారు . అయితే మిగతా వాళ్ళ విషయం పక్కన పెడితే బ్రహ్మానందం తనయుడు గౌతమ్ కు ఈ సినిమా విజయం తప్పనిసరి ఎందుకంటే పదేళ్లుగా హిట్ కోసం పోరాడుతూనే ఉన్నాడు . బ్రహ్మానందం కూడా తన అమ్ములపొదిలో ఉన్న అన్ని అస్త్రాలను వాడాడు కానీ ప్రయోజనం లేకుండా పోయింది . అగ్ర హీరోలైన అందరి చేత తన కొడుకుని ప్రమోట్ చేయించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసాడు కానీ అవన్నీ బెడిసి కొట్టాయి అందుకే ఇప్పుడు మను చిత్రానికి పెద్ద వాళ్ళను అడగటానికి మొహమాట పడ్డాడనుకుంటా సింపుల్ గా కానిచ్చేశారు . అయితే ట్రైలర్ బాగుండటంతో మను చిత్రం హిట్ అవుతుందేమో చూడాలి , ఇప్పుడైనా హిట్ కొడితే ఆ వారసుడు లక్కీ నే లేదంటే ఇక అంతే సంగతులు .

English Title: brahmanandam son gautham manu trailer interesting