ఆ నటుడు కరివేపాకు కంటే దారుణమా


brahmanandam turned like junior artist

కూరలో రుచి కోసం కరివేపాకు వేస్తారు కానీ తినే సమయానికి దాన్ని తీసి పక్కన పడేస్తారు అదీ కరివేపాకు పరిస్థితి ఇప్పుడు హాస్య నటుడు బ్రహ్మానందం పరిస్థితి కూడా అలాగే తయారయ్యింది . ఒకప్పుడు బ్రహ్మానందం డేట్స్ ముందుగా తీసుకోండి అతడి డేట్స్ ప్రకారమే మన షూటింగ్ అని అగ్ర హీరోలు సైతం అనేవాళ్ళు . అప్పట్లో బ్రహ్మానందం హవా నడిచింది ఏకంగా అగ్ర హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ కూడా తీసుకున్నాడు . ఒకదశలో హీరో కంటే ఎక్కువగా బ్రహ్మానందం కోసమే సినిమాకు వచ్చేవాళ్ళు ప్రేక్షకులు .

కట్ చేస్తే కాలం మారింది , ఇప్పుడు బ్రహ్మానందం కు పోటీగా బోలెడు మంది కమెడియన్ లు వచ్చారు దాంతో సంవత్సరాల తరబడి సాగిన బ్రహ్మి స్టార్ డం మొత్తం పోయింది . తాజాగా బ్రహ్మానందం ప్రేక్షకులను నవ్వించలేక పోతున్నాడు అంతేకాదు జూనియర్ ఆర్టిస్ట్ కంటే ఎక్కువగా గ్రాఫ్ పడిపోయింది . తాజాగా రవితేజ నటించిన నేల టిక్కెట్టు సినిమానే బ్రహ్మి రేంజ్ ఏంటి అన్నది తేలిపోయింది . ఈ సినిమాలో బ్రహ్మానందం ని మరీ జూనియర్ ఆర్టిస్ట్ లా వాడుకున్నారు పాపం .