ఆగస్టు 3న మహేష్ ప్లాప్ చిత్రం బ్రహ్మోత్సవం


Brahmotsavam Tamil Vs Bhale Bhale Magadivoy Tamil Remake

మహేష్ బాబు నటించిన ప్లాప్ చిత్రం బ్రహ్మోత్సవం ఆగస్టు 3న తమిళనాట విడుదల అవుతోంది . తెలుగులో 2016 లో విడుదలైన ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది . కట్ చేస్తే ఆ సినిమాని ఇప్పుడు తమిళనాట ” అనిరుద్ ” పేరుతో విడుదల చేస్తున్నారు . మహేష్ సరసన ముగ్గురు భామలు సమంత , కాజల్ అగర్వాల్ , ప్రణీత లు నటించారు . సత్యరాజ్ కీలక పాత్ర పోషించాడు కాగా రెండేళ్ల తర్వాత మహేష్ నటించిన ప్లాప్ చిత్రాన్ని తమిళ్ లో విడుదల చేస్తుండటం గమనార్హం .

ఈ సినిమాకు పోటీగా అదే రోజున తెలుగులో సూపర్ హిట్ అయిన భలే భలే మగాడివోయ్ చిత్రం తమిళ్ లో రీమేక్ అయ్యింది ఇక ఆ సినిమా పేరు ఏంటో తెలుసా ….. గజినీకాంత్ . తమిళ హీరో ఆర్య నటించిన గజినీకాంత్ ని కూడా ఆగస్టు 3న విడుదల చేస్తున్నారు . తమిళ్ లో ఆర్య స్టార్ హీరో అన్నట్లే ! అయితే అక్కడ మహేష్ కు ఆర్య స్థాయిలో మార్కెట్ లేదు కాకపోతే సమంత , కాజల్ అగర్వాల్ లు నటించారు కాబట్టి వాళ్ళ వల్ల కాస్త ఓపెనింగ్స్ వస్తాయేమో కానీ ఇక్కడ డిజాస్టర్ అయిన సినిమా కాబట్టి మహేష్ చిత్రానికి పెద్దగా క్రేజ్ లేకుండా పోయింది . ఇక ఇక్కడ హిట్ అయిన భలే భలే మగాడివోయ్ చిత్రం గజినీకాంత్ గా వస్తోంది కాబట్టి అది హిట్ అవ్వొచ్చు .

English Title: Brahmotsavam Tamil Vs Bhale Bhale Magadivoy Tamil Remake