“బ్రాండ్ బాబు” టీజర్ కు మంచి స్పందన. త్వరలో ఆడియో, ఆగస్ట్ మొదటివారంలో సినిమా విడుదల!


Brand Babu’ Audio Launch Soon

మారుతి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ శైలేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌భాక‌ర్.పి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.శైలేంద్ర‌బాబు నిర్మిస్తోన్న చిత్రం బ్రాండ్ బాబు. డైరెక్టర్ మారుతి కథ అందించిన ఈ మూవీలో సుమంత్ శైలేంద్ర‌, ఈషా రెబ్బా, పూజిత వ‌న్నోడ హీరో హీరోయిన్స్ గా నటించారు. ముర‌ళీశ‌ర్మ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.

డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌ విడుదల చేసిన బ్రాండ్ బాబు టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. త్వరలో ఆడియోను విడుదల చెయ్యాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్ట్ మొదటివారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మారుతి స్టైల్ లో హీరో క్యారెక్టరైజేషన్ ఉండబోతోంది. ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ ప్రభాకర్.

నటీనటులు:
సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ, మురళి శర్మ, పూజిత పొన్నాడ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్, వేణు వై, నలీన్, పి. సాయి కుమార్, కోటేష్ మన్నవ, కిరణ్.

సాంకేతిక నిపుణులు:
స్టోరి: మారుతి
డైరెక్టర్: ప్రభాకర్.పి
నిర్మాత: ఎస్. శైలేంద్ర
బ్యానర్: శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్
మ్యూజిక్: జేబి
లిరిక్స్: పూర్ణచెర్రీ
కెమెరామెన్: కార్తీక్ ఫలణి
ఎడిటర్: ఉద్ధవ్ ఎస్.బి
ఆర్ట్ డైరెక్టర్: మురళి ఎస్.వి
పి ఆర్ ఓ: వంశీశేఖర్