విజయ్ దేవరకొండతో బాగా ఎంజాయ్ చేసిందట


Vijay Devarakonda and Izabelle Leite
Vijay Devarakonda and Izabelle Leite

బ్రెజిల్ పాప ఇజబెల్ లీట్ హీరో విజయ్ దేవరకొండ తో ఫ్రాన్స్ లో బాగా ఎంజాయ్ చేసిందట , ఎన్నో కొత్త కొత్త అనుభవాలు పంచాడట దాంతో ఈ రౌడీ తో బాగా ఎంజాయ్ చేశాను అవి నా జీవితంలో మర్చిపోలేని రోజులు అంటూ ట్వీట్ చేసింది అంతేనా రౌడీ ని మిస్ అవుతున్నాను అంటూ తన విరహ తాపాన్ని కూడా తెలియజేస్తోంది . ఇంతకీ ఇజబెల్ లీట్ అనే పాప ఎవరంటే విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న క్రాంతిమాధవ్ చిత్రంలో ఒక హీరోయిన్ .

క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో రాశి ఖన్నా , ఐశ్వర్య రాజేష్ లతో పాటుగా ఇజబెల్ లీట్ కూడా ఒక హీరోయిన్ గా నటిస్తోంది . ఈ సినిమా కోసం ఇటీవలే ఫ్రాన్స్ కు వెళ్లారు . అక్కడ బాగా ఎంజాయ్ చేశారట అయితే షూటింగ్ పూర్తికావడంతో అక్కడి నుండి బ్రెజిల్ వెళ్ళింది ఈ పాప దాంతో తన అనుభవాన్ని ఇలా సోషల్ మీడియాలో పంచేసింది .