ఇంట్రెస్టింగ్ గా ఉన్న బ్రోచేవారెవరురా !


శ్రీవిష్ణు , నివేదా థామస్ , నివేదా పేతురాజ్ , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ , సత్యదేవ్ తదితరులు నటించిన చిత్రం ” బ్రోచే వారెవరురా ”. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో విజయ్ కుమార్ మన్యం నిర్మించిన ఈ చిత్ర టీజర్ ని ఈరోజు హైదరాబాద్ లో విడుదల చేసారు దర్శకుడు అనిల్ రావిపూడి . టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ఒక్కసారిగా బ్రోచే వారెవరురా చిత్రంపై అంచనాలు ఎక్కువయ్యాయి . 
 
విభిన్న తరహా కథా చిత్రమని టీజర్ తోనే తెలిసిపోతోంది . ఈ టీజర్ కు వ్యూస్ కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి . శ్రీ విష్ణు విభిన్న తరహా పాత్రలను ఎంచుకొని మరీ చేస్తున్నాడు దాంతో ఈ సినిమా కూడా ఆ కోవలోకే చెందుతుందని భావిస్తున్నారు . ఇక ఈ చిత్రాన్ని జూన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆ చిత్ర బృందం .