అడవి సెట్ కోసం భారీగా ఖర్చుపెట్టనున్న పుష్ప టీమ్


అడవి సెట్ కోసం భారీగా ఖర్చుపెట్టనున్న పుష్ప టీమ్
అడవి సెట్ కోసం భారీగా ఖర్చుపెట్టనున్న పుష్ప టీమ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప చిత్రం తెరకెక్కనున్న విషయం తెల్సిందే. ఈ పాటికే ఈ సినిమా షూటింగ్ మొదలుకావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ఈ సినిమా కథ ప్రకారం మేజర్ గా అడవుల్లో చిత్రీకరించాల్సి ఉంది. అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం షూటింగులకు అనుమతులు ఇచ్చినా కానీ అవుట్ డోర్ షూటింగులకు అనుమతులు తెచ్చుకోవడం అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే అవుట్ డోర్ షూటింగ్ అంటే అందులో ఉండే ఛాలెంజెస్ వేరు.

అందుకని పుష్ప టీమ్ అన్నపూర్ణ 7 ఎకరాలలో అడవి సెట్ ను వేద్దామని డిసైడ్ అయినట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. అయితే ఇప్పుడు ఈ సెట్ కోసం భారీగా ఖర్చు అవ్వనుంది. అసలే నిర్మాతలు ఇప్పుడు ఖర్చుకు వెనకాడాల్సిన పరిస్థితి ఉంది. కరోనా వైరస్ కారణంగా దారుణంగా నష్టపోయిన నిర్మాతలు ఖర్చును ఎలా తగ్గిద్దామా అని ఆలోచిస్తున్నారు. కానీ దానికి భిన్నంగా పుష్ప టీమ్ అడవి సెట్ కోసం కొన్ని కోట్లు ఖర్చుపెట్టనుంది.

అడవిని సెట్ ద్వారా సృష్టించడం అనేది మాములు విషయం కాదు. అందులో ఖర్చుతో పాటు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. మరి వాటిని పుష్ప టీమ్ ఎలా అధిగమిస్తుందో చూడాలి.