రిలీజ్ అయిన పాటను చూసి బూతులు తిడుతున్న జనాలు


రిలీజ్ అయిన పాటను చూసి బూతులు తిడుతున్న జనాలు
రిలీజ్ అయిన పాటను చూసి బూతులు తిడుతున్న జనాలు

ఒక చిన్న సామెత చెప్పి తర్వాత అసలు మేటర్ లోకి వెళ్దాం.
“దగ్గడం చేతకానప్పుడు “దగ్గు” రాదని చెప్పాలి కానీ.. నేను “దగ్గుబాటి రానా“ అంత తోపు అని చెప్పకూడదు.”
ఏ పనైనా దానికంటూ కొన్ని పరిమితులు ఉంటాయి. ఒక సినిమా తీసినప్పుడు దానికి తగినట్టుగా ఉండే పాటలు సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ప్రస్తుతం ఉన్న సినిమాలు చేసే వారికి దర్శకుడు, నిర్ణయంతో సంబంధం లేకుండా చుట్టుపక్కల ఉండే వాళ్ల విజ్ఞాన ప్రదర్శనలపై ఆధారపడి నిర్ణయాలు ఉంటున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు అప్పుడెప్పుడో “దళం” అనే ఒక మంచి సినిమా తీసిన దర్శకుడు జీవన్ రెడ్డి, ఇప్పుడు అభినవ ఉస్మానియా చేగువేరా ఆయన “జార్జి రెడ్డి” బయోపిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. తనతోపాటు సినిమా ప్రయాణంలో ఎప్పుడూ తోడుగా ఉన్న తన రూమ్మేట్ ను, అదే వంగవీటి సినిమాలో హీరోగా చేసిన శాండీ హీరోగా ఈ సినిమాలో పెట్టుకున్నాడు.

కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన జార్జిరెడ్డి ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. డైలాగ్స్ పరంగా హీరో శాండీ ఇంకొంచెం మెరుగుపరచుకోవాలి ఉన్నట్లు చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో సత్యదేవ్, వంశీ చాగంటి, ఆర్ఎక్స్ 100 లక్ష్మణ్, కమెడియన్ ప్రవీణ్ నూకరాజు వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. హీరోయిన్ గా ముస్కాన్ నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి “బుల్లెట్ సాంగ్” అనే ఒక పాటను రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో పాటల ద్వారా కోట్లు సంపాదిస్తున్న రచయిత & సంగీత దర్శకుడు & గాయకుడు అయిన “మిట్టపల్లి సురేందర్” ఈ పాటను స్వరపరచగా ప్రతి పండగ కి ఒక మంచి కొత్త పాట తో మన ముందుకు వచ్చే గాయని “మంగ్లీ” ఈ పాటను ఆలపించారు.

అయితే ఈ పాట సినిమా స్థాయికి తగ్గట్టుగా లేదని సాహిత్యము సంగీతము పరంగా చూసుకుంటే ఒక చిన్న ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లా ఉందని సిని అభిమానులు ముఖ్యంగా జార్జిరెడ్డి అభిమానులు పెదవి విరుస్తున్నారు. మరి సినిమాలో అయినా పూర్తిగా సిద్ధమైన పాట ఉంటుందా .? లేక పోతే ఇలాంటి పాటలే ఉంటాయా..? అని ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు. ఏదిఏమైనా, ట్రైలర్ తో మాంచి కిక్ ఇచ్చిన దర్శకుడు జీవన్ రెడ్డి ఈ పాటతో సినిమా మీద ఉన్న హైప్ ను తానే తగ్గించినట్లు అయింది.