నిన్న దిల్ రాజు.. నేడు బన్నీవాసు..!


 

Bunny Vasu a lucky muscat to young heros
Bunny Vasu a lucky muscat to young heros

దిల్ రాజుకు ఇండ‌స్ట్రీలో మంచి పేరుంది. ఏదైనా క‌థ‌ని జ‌డ్జ్ చేయాలంటే దిల్ రాజే. హిట్టు లేని వారికి త‌మ సంస్థ‌లో హిట్టు ఇవ్వాలంటే దిల్ రాజే. ఏదైనా ప్రాజెక్ట్‌ని జ‌నాల్లోకి తీసుకెళ్లాలంటే దిల్ రాజే ముందుండాలి. ఆయ‌న హ్యాండు ప‌డాలి. అచ్చ ఆయ‌న త‌ర‌హాలోనే ఇప్పుడు బ‌న్నీ వాసు త‌యార‌వుతున్నారు. ఆయ‌న ఏ సినిమా టేక‌ప్ చేస్తే అది హిట్టే. ఆయ‌న ఏ సినిమా బ్యాక్ వున్నా అది హిట్టే.. గ‌త కొన్ని నెల‌లుగా జ‌రుగుతున్న‌ది ఇదే.

గ‌త కొన్నేళ్ల క్రితం నేచుర‌ల్ స్టార్ నానికి హిట్టు లేదు. వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బందుల్లో వున్నాడు. ఆ స‌మ‌యంలో బ‌న్నీవాసు నిర్మించిన `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌` నానికి మంచి విజ‌యాన్ని అందించ‌డ‌మే కాకుండా మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేలా చేసింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేసిన `గీత గోవిందం`బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించింది.

సాలీడ్ హిట్టు కోసం ఎదురుచూస్తున్న సాయిధ‌ర‌మ్‌తేజ్‌కి `ప్ర‌తిరోజు పండ‌గే` చిత్రంతో తిరుగులేని విజ‌యాన్ని అందించారు. తాజాగా వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న అక్కినేని అఖిల్ కెరీర్‌ని కొత్త మ‌లుపు తిప్పాల‌ని బ‌న్నీవాసు నిర్మిస్తున్న చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌`. బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ రూపొందిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఈ సినిమాతో అఖిల్‌కి హిట్ గ్యారెంటీ అనే మాటలు వినిపిస్తున్నాయి. ఒక‌ప్పుడు దిల్ రాజు చేయిప‌డితే ఆ హీరోకి హిట్టొచ్చేది కానీ ఇప్ప‌డు బ‌న్నీవాసు చేయి ప‌డితే బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌స్తోంది అనే సెంటిమెంట్ మొద‌లైంది.