ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి మ‌రీ పిలిచిన బ‌న్నీ!


ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి మ‌రీ పిలిచిన బ‌న్నీ!
ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి మ‌రీ పిలిచిన బ‌న్నీ!

టాలీవుడ్‌లో హీరోల మ‌ధ్య వార్ న‌డుస్తున్నా హీరోల మ‌ధ్య మాత్రం మంచి స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణం మొద‌లైంది. గ‌త కొంత కాలంగా యంగ్ హీరోల త‌రం మొద‌లు కావ‌డంతో ఈ వాతావ‌ర‌ణంలో మార్పులు మొద‌ల‌య్యాయి. గ‌తంలో హీరోల మ‌ధ్య స‌ఖ్య‌త లేదా అంటే వుంది. కానీ అది నేటి త‌రం స్టార్ హీరోల త‌ర‌హ‌లో మాత్రం లేదు. ఇండ‌స్ట్రీలో వున్న క్రేజీ హీరోలు త‌ర‌చూ క‌లుస్తూ పార్టీలు కూడా చేసుకుంటున్నారు.

ఆ మ‌ధ్య రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, మ‌హేష్ క‌లిసి ఓ పార్టీ చేసుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. బ‌న్నీ న‌టించిన తాజా చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బస్ట‌ర్ హిట్‌గా నిల‌చి స‌రికొత్త రికార్డులు సృష్టించింది. ఇండ‌స్ట్రీ హిట్‌గా నిల‌వ‌డంతో త్వ‌ర‌లో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు ఓ స్పెష‌ల్ పార్టీని, మీడియాకు మ‌రో పార్టీని బ‌న్పీ ఏర్పాటు చేయ‌బోతున్నారు.

ఇండ‌స్ట్రీ వ‌ర్గాల కోసం ఇవ్వ‌నున్న పార్టీ కోసం ఇప్ప‌టికే చాలా మందికి ఆహ్వానాలు అందాయ‌ని తెలిసింది. ముఖ్యంగా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌ని అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ డైరెక్ట్‌గా వెళ్లి పార్టీకి రావాల‌ని ఆహ్వానించార‌ట‌. ఇది ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. `అల వైకుంఠ‌పుర‌ములో` రిలీజ్ రోజు బ‌న్నీని `బావా అంటూ సంబోధిస్తూ ఎన్టీఆర్ ఓ పోస్ట్ పెట్ట‌డం, దానికి అదే త‌ర‌హాలో బ‌న్నీ స్పందిండం తెలిసిందే.