`పుష్ప‌` టీమ్ అప్‌సెట్‌.. షూటింగ్ ఆగిపోయిందా?`పుష్ప‌` టీమ్ అప్‌సెట్‌.. షూటింగ్ ఆగిపోయిందా?
`పుష్ప‌` టీమ్ అప్‌సెట్‌.. షూటింగ్ ఆగిపోయిందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్తిస్తున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ముత్యం శెట్టి మీడియా స‌మ‌ర్ప‌ణ‌లో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, మల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.

గ‌త ఎనిమిది నెల‌లుగా లాక్‌డౌన్ కార‌ణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే రాజ‌మండ్రి స‌మీపంలోని మారేడుమిల్లిలోని థిక్ ఫారెస్ట్‌లో ప్రారంభ‌మైంది. అంతా సాఫీగానే సాగిపోతోంది. ఇటీవ‌ల సెట్‌లో మాసీవ్ లుక్‌లో వున్న బ‌న్నీ లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇంత‌లోనే ఈ మూవీ షూటింగ్‌ని అర్థాంత‌రంగా ఆపేశార‌ని తెలుస్తోంది. కార‌ణం చిత్ర యూనిట్‌లోని కొంత మందికి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డ‌మేన‌ని తెలుస్తోంది.

ఈ విష‌యం తెలియ‌గానే టీమ్ అల‌ర్ట్ అయి షూటింగ్‌ని ఆపేశార‌ని చెబుతున్నారు. అనూహ్య ప‌రిణామాల నేప‌థ్యంలో టీమ్ మొత్తం షూటింగ్ ఆపేసి హుటా హుటిన హైద‌రాబాద్ చేరుకున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు సుకుమార్ అప్‌సెట్ అయ్యార‌ట‌. ఇంత కాలం వేయిట్ చేసి అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని ప‌క్కాగా ప‌ట్టాలెక్కిస్తే ఇలా జ‌రిగింది ఏంట‌ని ఫీల‌వుతున్నార‌ట‌.