`పుష్ప‌` టీజ‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారా?

Bunnys pushpa teaser release date locked
Bunnys pushpa teaser release date locked

`అల వైకుంఠ‌పుర‌ములో` ఇండ‌స్ట్రీ హిట్‌తో మేఘాల్లో తేలిపోతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అదే ఊపులో స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌తో క‌లిసి చేస్తున్న పాన్ ఇండియా మూవీ `పుష్ప‌`. మైత్రీ మూవీమేక‌ర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు, ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్నీ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది.

ఫ‌స్ట్ లుక్ తో ఈ మూవీ ఏ స్థాయిలో వుండ‌బోతోందో సుకుమార్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఈ మూవీపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. బ‌న్నీ ర‌గ్గ్‌డ్ లుక్‌, లారీడ్రైవ‌ర్ గా మాస్ క్యారెక్ట‌ర్‌, గంధ‌పు చ‌క్క‌ల్ని స్ల‌గ్లింగ్ చేసే ఊర‌మాస్ పాత్ర‌లో పుష్ప‌రాజ్‌గా బ‌న్నీ క్యారెక్ట‌ర్‌ని మ‌లిచిన తీరు ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో, బ‌న్నీ అభిమాన‌ల్లో భారీ అంచనాల్ని రేకెత్తిస్తోంది.

ఇదిలా వుంటే ఈ మూవీ టీజ‌ర్ ఎప్పుడా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌లో బ‌న్నీ తాజా లుక్ చూసిన వారంతా టీజ‌ర్‌లో భీభ‌త్స‌మే అంటూ ఊహించుకుంటున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్‌కి డేట్ ఫిక్స‌యిన‌ట్టు తెలిసింది. ఏప్రిల్ 8న బ‌న్నీ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ మూవీ టీజ‌ర్‌ని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ఫిక్స్ అయిన‌ట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆగ‌స్టు 13న రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే.