బ‌న్నీ ఆ సినిమా రైట్స్ వేస్ట్ చేశాడా?


బ‌న్నీ ఆ సినిమా రైట్స్ వేస్ట్ చేశాడా?
బ‌న్నీ ఆ సినిమా రైట్స్ వేస్ట్ చేశాడా?

అల్లు అర్జున్ న‌టించిన `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ కావ‌డంతో మ‌రో సినిమాతో ప్రేక్ష‌18 నెల‌లు ప‌ట్టింది. అయితే సీరియ‌స్ మోడ్ చిత్రాల్లో న‌టించిన స‌రైనోడు, దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.. ఇలా మూడు చిత్రాలు సీరియ‌స్ టోన్‌లో రూపొందిన‌వే కావ‌డంతో త‌దుప‌రి చిత్రంలో ఫుల్ ఎంట‌ర్‌టైన‌మెంట్ వుండాల‌నుకున్నార‌ట‌. ఇందు కోసం బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `సోనూకి టిటు కి స్వీటీ` చిత్ర తెలుగు రీమేక్ హ‌క్కుల్ని తీసుకున్నారు.

`అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రానికి ముందు త్రివిక్ర‌మ్‌తో ఈ చిత్రాన్నే రీమేక్ చేయాల‌నుకున్నారు. కానీ త్రివిక్ర‌మ్ చెప్పిన లైన్ న‌చ్చ‌డంతో ఆ చిత్రాన్ని ప‌క్క‌న పెట్టి కొత్త క‌థ‌తో ముందుకెళ్లారు. అదే `అల వైకుంఠ‌పుర‌ములో`. ఈ సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచి బ‌న్నీకి మ‌ర‌పురాని విజ‌యాన్ని అందించింది.

అయితే ఈ సినిమా ప్లేస్‌లో చేయాల‌నుకున్న`సోనూకి టిటు కి స్వీటీ` రీమేక్ రైట్స్ మాత్రం వేస్ట‌యిపోయాయని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని ఇప్పుట్లో ఎవ‌రూ చేసే అవ‌కాశాలు క‌నిపించడం లేద‌ని, అల్లు శిరీష్ కూడా ఈ రీమేక్‌లో న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపించ‌డం లేద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. అల్లు శిరీష్ త్వ‌ర‌లో ఓ త‌మిళ రీమేక్‌లో న‌టించ‌బోతున్నారు. అందుకే `సోనూకి టిటు కి స్వీటీ`ని చేయ‌లేన‌ని చెప్పేశార‌ట‌. దీంతో ఈ సినిమా రీమేక్ ఇప్ప‌ట్లో క‌ష్ట‌మే అని వినిపిస్తోంది.