‘అవసరాల’ కోసం ఎమన్నా చేస్తారు…


'అవసరాల' కోసం ఎమన్నా చేస్తారు...
‘అవసరాల’ కోసం ఎమన్నా చేస్తారు…

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ లిస్ట్ లో ఒకలు ‘క్రిష్ జాగర్లముడి‘ గారు. ఇక క్రిష్ గారు వారి స్నేహితులు రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి గారు కలిసి ‘ఫస్ట్ ఫ్రేమ్  ఎంటర్ టైన్మెంట్’ బ్యానర్ మీద కొన్ని సినిమాలని నిర్మించేవారు. ఆ నిర్మాణంలో హిట్లే కాదు ఫ్లాపులు కూడా ఉంటాయి అని సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రెండవ సినిమా ‘అంతరిక్షం’ ద్వారా తెలిసింది వారికి. ‘ఘాజి’ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి రెండవ చిత్రంతో నిరాశపరిచాడు.

సంకల్ప్ రెడ్డి గారు అతనికి ఫ్లాప్ ఇచ్చుకున్నారు అలాగే క్రిష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి వారిని కూడా పెద్ద ప్రమాదంలో పడేసాడు. ఇక ఊపిరి పీల్చుకోవడానికి కొద్దీ సంవత్సరాలు సమయం తీసుకున్న క్రిష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి గార్లు ఇంకొక ప్రయోగం చేపట్టారు. బర్నింగ్ స్టార్ ‘సంపూర్ణేష్’ బాబుతో ‘నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు’ సినిమాని మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ ఏమి జరిగిందో ఏమో కానీ ఆ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయింది. కొంచెం సమయం తీసుకున్న తర్వాత ఈ రోజు మంచి రోజు అని పూజ కార్యక్రమాలు చేపట్టారు.

ఇందులో మనకి రెండు ట్విస్టులు ఉన్నాయి…ఒకటి హీరో గా సంపూర్ణేష్ బాబు గారు కాదు. టాలీవుడ్ లో అందరికంటే ఎక్కువ పొడుగు ఉన్న లిస్ట్ లో ఒకలైన హీరో, దర్శకులు, నటులు ‘శ్రీనివాస్ అవసరాల’ గారు. ఇంకొకటి నిర్మాతగా దిల్ రాజు గారు కూడా ఈ ప్రాజెక్ట్ లో చేరిపోయారు. ఆగి పోయిన సినిమాని తిరిగి మళ్ళీ మొదలు పెట్టారు అంటే అది దిల్ రాజు గారి వల్లనే సాధ్యం అయివుంటుంది అని మనకి అర్ధం అయిపోతుంది. అవును దిల్ రాజు గారు ఈ మధ్య తన నిర్మాణ రంగాన్ని చిన్న సినిమాల కథ నచ్చితే వెంటనే రంగం లోకి దింపేస్తున్నారు.

కథా నాయికగా ‘చిలసౌ’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన నటి ‘రుహాని శర్మ’. మొత్తానికి ఈ నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు సినిమాకి దిల్ రాజు, క్రిష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లముడి లాంటి పెద్ద వాళ్ళు నిర్మాతలుగా మారి  శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌ పై భారీగా నిర్మిస్తున్నారు. రాచ కొండ విద్య సాగర్ సాగర్ గారు దర్శకులుగా పరిచయం అవ్వబోతున్నారు ఈ సినిమా ద్వారా. స్వీకర్ అగస్తి సంగీత దర్శకులు…ఇప్పుడు ఈ సినిమా మీద జనాలకి ఆసక్తి పెరిగింది. చూద్దాం మరి ఇంతమంది దిగ్గజాలు కలుస్తున్న ఈ సినిమా ఎలా జనాలని  మెప్పిస్తుందో?