RRR: అవకాశం వచ్చినప్పుడు భయపడ్డా

Burra sai madhav dialogues for RRR movie

బాహుబలి లాంటి బిగ్ సక్సెస్ అనంతరం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా RRR. వరల్డ్ వైడ్ గా ఉన్న ఎంతో మంది భారతీయ సినీ అభిమానులు ఈ బిగ్ మల్టీస్టారర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఉహాలకందని రేంజ్ లో దర్శకుడు సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది.

ఇకపోతే సినిమాకు సంబంధించిన డైలాగ్స్ పై రచయిత సాయి మాధవ్ బుర్రా వివరణ ఇచ్చారు. మహానటి – కృష్ణం వందే  జగద్గురుమ్ – గౌతమి పుత్ర శాతకర్ణి – సైరా వంటి ఎన్నో హిట్ సినిమాలకు మాటలు అందించిన సాయి మాధవ్ ఇప్పుడు RRR సినిమాకు కూడా అదే తరహాలో మాటలు అందించారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాపై చిన్న వివరణ ఇచ్చారు.
“ఈ సినిమాలో మొదట అవకాశం వచ్చినప్పుడు చాలా భయపడ్డాను. రాజమౌళి లాంటి దర్శకుడు సినిమాకు మాటలు రాయడం అంటే అంత సులభం కాదు. కానీ నాకు సులభంగానే అనిపించింది. ఇద్దరు స్టార్ హీరోలున్న ఈ సినిమా కథలో ఒక బ్యాలెన్స్ ఉంది. మాటలు సినిమాలో సందర్భానుసారంగా ఉంటాయి. రాజమౌళి గారి విజన్ అద్భుతంగా ఉంటుంది. ఆయన మనస్సులో RRR సినిమా ఎప్పుడో పూర్తయ్యింది. ఆయన మనసులో ఉన్న కథకు నేను డైలాగులు రాశాను” అని సాయి మాధవ్ వివరణ ఇచ్చారు.