బస్ స్టాప్ ఆనంది మళ్ళీ తెలుగు సినిమాకు

బస్ స్టాప్ ఆనంది మళ్ళీ తెలుగు సినిమాకు
బస్ స్టాప్ ఆనంది మళ్ళీ తెలుగు సినిమాకు

బస్ స్టాప్ సినిమా ద్వారా గుర్తింపు పొందింది ఆనంది. అయితే బస్ స్టాప్ విజయం సాధించినా కానీ ఆనందికి అవకాశాలు పెద్దగా రాలేదు. ఆనంది తెలుగమ్మాయి. వరంగల్ వారి స్వస్థలం. టాలీవుడ్ ఆదరించకపోవడంతో కోలీవుడ్ కు చెక్కేసింది ఈ అమ్మడు. అయితే అక్కడ తన దశ తిరిగింది. వరస అవకాశాలను, విజయాలను సొంతం చేసుకుంది.

తమిళ్ లో దాదాపు డజనుకు పైగా సినిమాలు చేసిన ఆనంది ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అవుతోంది. అ! సినిమాతో అందరినీ ఇంప్రెస్ చేసిన ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన జాంబీ రెడ్డి చిత్రం ద్వారా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. అందులో హీరోయిన్ గా నటించింది.

ఇక సుధీర్ బాబు హీరోగా ప్రకటించిన శ్రీదేవి సోడా సెంటర్ లో ఆనంది హీరోయిన్ గా ఎంపికైంది. పలాస ఫేమ్ కరుణ కుమార్ ఈ చిత్రాన్ని.తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ఇలా వరస చిత్రాలతో ఈ తెలుగమ్మాయి టాలీవుడ్ లో బిజీ అవుతుందేమో చూడాలి.