బయ్యర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి

Buyers facing tension with Rajini's 2.0550 కోట్ల భారీ బడ్జెట్ తో ఆసియా ఖండంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం 2.0 . ఈ చిత్రాన్ని ఈనెల భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక తెలంగాణలో ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది . భారీ బడ్జెట్ కావడంతో బయ్యర్లు కూడా పోటీపడి ఈ సినిమాని కొన్నారు దాంతో మొదటి రోజున , మూడు రోజుల్లోనే ఎంత వీలయితే అంత లాగడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే తెలంగాణలో మొదటి రోజున 600కు పైగా స్క్రీన్ లలో విడుదల చేస్తున్నారు . ఆ తర్వాత నాలుగు వందల థియేటర్ లలో 2. 0 సినిమా రన్ కానుంది .

జనాలకు నచ్చితే , డిమాండ్ ఉంటె ఆ నాలుగు వందల స్క్రీన్ లలో రన్ అవుతుంది లేదంటే వాటిల్లోంచి కూడా తీసి పడేస్తారు . అయితే రజనీకాంత్ హీరో కాబట్టి మొదటి మూడు రోజులకు అయితే నో డౌట్ ! ఆ తర్వాత సినిమా నడవాలంటే తప్పకుండా కథ , కథనం బాగుంటేనే ! లేదంటే రజనీ నటించిన మిగతా చిత్రాల లాగే ప్లాప్ జాబితాలో చేరడం ఖాయం . అయితే ఈ సినిమాని కొన్న బయ్యర్ల గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెత్తుతున్నాయి . ఎందుకంటే గత ఎనిమిదేళ్లుగా రజనీకాంత్ నటించిన చిత్రాలన్నీ ఘోర పరాజయం పొందుతూనే ఉన్నాయి మరి .

English Title: Buyers facing tension with Rajini’s 2.0