డిసెంబర్ నుండి సెల్లు బిల్లుతో జేబుకి చిల్లి గ్యారంటీ


Call data charges hike from December 1st
Call data charges hike from December 1st

మా అన్నయ్య మహేష్ బాబు  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చెప్పిన ఒక అద్భుతమైన డైలాగ్ ను గుర్తు చేసుకుంటే,

 “ఈ శతాబ్దంలో కనిపెట్టిన అత్యంత ఖరీదైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది ఇదే (సెల్ ఫోన్).” నిజంగానే సెల్ వచ్చాక మనుషులు కనీసం సాటి మనిషితో మాట్లాడటం తగ్గించేశారు. అన్నం తింటున్నా, బండి నడుపుతున్నా, లేదా అసలు ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా చేతిలో సెల్ ఫోను చెవిలో ఇయర్ ఫోన్స్ లేకుండా మనిషి కనబడటం లేదు. 20వ శతాబ్దపు వ్యాపార ఎత్తుగడలలో భాగంగా ఒక మనిషికి అవసరానికి మించి అలవాటు చేయబడిన ఒక వస్తువు సెల్ ఫోన్. అందుకనే ఈ మధ్యనే మా గురువు గారు శంకర్ గారు 2.0 అనే ఒక సినిమా తీసి పనీపాటా లేకుండా ఊరికే సెల్ ఫోన్ వాడే వాళ్లందరిని గట్టిగా వేసుకున్నారు.

సరే ఇప్పుడు మేటర్ లోకి వస్తే, గత కొన్ని సంవత్సరాలుగా చీప్ గా ఇంకా మాట్లాడాలంటే డెడ్ చీప్ గా సెల్ ఫోన్ సేవలు సౌకర్యాలు ఉపయోగించుకున్న మన సమాజంలోని ప్రజలకు తొందరలో షాక్ తగలబోతోంది. వచ్చే నెల అనగా, డిసెంబర్ 1నుంచి ఛార్జీలను పెంచుతున్నట్లు అన్నిరకాల టెలికాం కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. అదేమంటే స్వయ్యాన కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు వసూలు చేస్తున్న దానిలో కనీసం 20 శాతానికి పెంచి వసూలు చేసుకోమన్నట్లుగా సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫోన్ కాల్ డేటా మరియు అన్ లిమిటెడ్ ఆఫర్ ఏదైనా కానీ, ఇప్పుడున్న టారిఫ్ లో కనీసం 20 శాతం అయినా పెరిగే అవకాశం ఉంది.

ఇలా చేయడం వల్ల తాత్కాలికంగా సెల్ ఫోన్లు కొనుగోలు తగ్గటం, సెల్ ఫోన్ ల రేట్లు పెరగటం,  అదేవిధంగా బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు తగ్గటం, ఆన్ లైన్ షాపింగ్ లు కూడా తగ్గటం ఇలా సెల్ ఫోన్ అనే ఒక బుల్లి వస్తువు మీద ఆధారపడిన ఒక పెద్ద మాఫియా అందరికీ వ్యాపారాలు తగ్గటం జరిగే అవకాశం ఉంది. మరి దీనికి కూడా ఫిక్స్ అయ్యి, రేట్లు పెంచడానికి సిద్ధమయ్యాయి మన టెలికాం కంపెనీలు.

ఉద్యోగులకు మొన్నటిదాకా ఊరికే వేలు లక్షల జీతాలు మింగపెట్టి, ఇప్పుడు పతివ్రత కబుర్లు చెబుతున్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కూడా పొదుపు మంత్రాన్ని పాటిస్తోంది. డిసెంబరు 1 నుంచి బీఎస్ఎన్ఎల్ కూడా చార్జీలను పెంచడం ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే డిసెంబర్ 1వ తేదీ నుంచి కాలింగ్ డేటా చార్జీలు పెంచుతున్నట్టు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా, రిలయన్స్, జియో సంస్థలు ప్రకటించాయి. ఇప్పటికే ఇతర నెట్ వర్క్ నెంబర్లకు చేసే కాల్స్ పై  ఐసీయూ ఛార్జీలను వసూలు చేస్తున్న జియో, మరొకసారి డేటా చార్జీలు,కాల్ చార్జీలు పెంచిన ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 ఏం చేస్తాం వ్యవస్థలను కంట్రోల్ లో పెట్టవలసిన వాళ్లు కుక్క బిస్కెట్లకు అమ్ముడు పోతున్నారు కదా.!