సుకుమార్ ఈసారైనా బన్నీని మెప్పించగలడా?


సుకుమార్ ఈసారైనా బన్నీని మెప్పించగలడా?
సుకుమార్ ఈసారైనా బన్నీని మెప్పించగలడా?

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ సాధారణంగా తన విభిన్నమైన స్క్రీన్ ప్లేతో జనాలను కన్ఫ్యూజ్ చేస్తాడన్న పేరుంది. అయితే కన్ఫ్యూజ్ చేసి హిట్లు కొట్టే సుకుమార్ రంగస్థలం సినిమా ద్వారా స్ట్రెయిట్ నరేషన్ తో కూడా దుమ్మురేపాడు. ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టింది. అయితే ఇంత భారీ హిట్ కొట్టినా కానీ సుకుమార్ ఇప్పటివరకూ తన తర్వాతి సినిమాను సెట్ చేసుకోలేకపోయాడు.

సూపర్ స్టార్ మహేష్ తో స్మగ్గ్లింగ్ నేపథ్యంలో ఉన్న కథ చెప్పినా అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. అయితే వెంటనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ అనౌన్స్ అవ్వడంతో అంతా సెట్ అనుకున్నారు. కానీ బన్నీతో ప్రాజెక్ట్ కూడా డౌట్ లో పడినట్లే అనిపిస్తోంది.

ఎందుకంటే ఇప్పటివరకూ బన్నీకి సుకుమార్ మూడు వెర్షన్స్ వినిపించగా, ఏదీ సెట్ అవ్వలేదు. మరికొద్ది రోజుల్లో సుకుమార్ నాలుగో వెర్షన్ ని వినిపించనున్నాడట. మరి దీంతోనైనా సుక్కూ బన్నీతో ప్రాజెక్ట్ ను ఓకే చేసుకుంటాడేమో చూడాలి.