రాజమౌళి సెంటిమెంట్ ను త్రివిక్రమ్ బ్రేక్ చేస్తాడా?


రాజమౌళి సెంటిమెంట్ ను త్రివిక్రమ్ బ్రేక్ చేస్తాడా?
రాజమౌళి సెంటిమెంట్ ను త్రివిక్రమ్ బ్రేక్ చేస్తాడా?

ఎంత కాదనుకున్నా, ఎవరు ఒప్పుకోకపోయినా ప్రతి ఒక్కరి లైఫ్ లో సెంటిమెంట్స్ అనేవి ఉంటాయి, ఉండాలి. సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి అవి మరికాస్త ఎక్కువే ఉంటాయి. సినిమా టైటిల్ దగ్గరనుండి రిలీజ్ టైమింగ్ వరకూ సెంటిమెంట్ కు ఆస్కారం లేకుండా ఉండదు. ఈ నేపథ్యంలో కాంబినేషన్ పరంగా కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయన్న విషయం తెల్సిందే. ఉదాహరణకు రాజమౌళి సినిమాల్లో పనిచేసే హీరోలకు ఎంత క్రేజ్ వస్తుందో చెప్పాల్సిన పనిలేదు. అయితే రాజమౌళితో చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టినా కూడా ఆ తర్వాత ఆయా హీరోలు స్ట్రగుల్ అయిన విషయం మనం చూసాం. ఎన్టీఆర్, రామ్ చరణ్, నితిన్, ప్రభాస్.. ఇలా హీరో ఎవరైనా కూడా రాజమౌళితో సినిమా చేసాక కొన్ని సినిమాలు ప్లాప్స్ గా నిలిచాయి.

ఇటీవలే బాహుబలి చేసాక ప్రభాస్ కూడా సాహోతో ప్లాప్ అందుకున్న విషయం తెల్సిందే. రీసెంట్ గా ప్రభాస్ విషయంలో కూడా ఇదే జరగ్గా మరి ఇప్పుడు ఎన్టీఆర్ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా లేదా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. దీనికి కారణం ఇప్పటికే ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాను ప్రకటించేశాడు. ప్రస్తుతం రాజమౌళితో ఆర్ ఆర్ ఆర్ సినిమాను ప్రకటించిన ఎన్టీఆర్.. మే నుండి తన తర్వాతి చిత్రాన్ని మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

మే నుండి షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏప్రిల్ కు సినిమాను విడుదల చేయబోతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నిన్ననే వచ్చేయగా ఈ సెంటిమెంట్ యాంగిల్ గురించి ఇప్పుడు అందరూ చర్చించుకోవడం కనిపిస్తోంది.

ఆర్ ఆర్ ఆర్ తో అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీఆర్ భీభత్సమైన హిట్ అందేసుకుంటారు. అందులో సందేహమే లేదు. మరి తర్వాతి సినిమాతో ఎలాంటి ఫలితం అందుకుంటారోనన్న సందేహం అందరిలో ఉంది. మరి ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో తన నెక్స్ట్ సినిమాను ప్రకటించిన వేళ త్రివిక్రమ్ అయినా రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేసి ఎన్టీఆర్ కు హిట్ ఇస్తాడేమో చూడాలి.