రాజ్ తరుణ్ పై కేసు నమోదు


Raj Tarun
Raj Tarun

యంగ్ హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు అయ్యింది. నార్సింగ్ సర్కిల్ పరిధిలో రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడంతో అయోమయం నెలకొంది. అయితే కారు ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తూ ట్వీట్ చేయడంతో నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ కు నోటీసులు పంపించారు అంతేకాదు కేసు కూడా నమోదు చేసారు .

రాజ్ తరుణ్ కు నోటీసులు అందించిన తర్వాత వాటికీ సమాధానం విన్న తర్వాత తదుపరి చర్యలకు సిద్ధం అవుతున్నారు నార్సింగ్ పోలీసులు . అయితే కారు ప్రమాదం జరిగినప్పుడు మొదట తోసిపుచ్చిన రాజ్ తరుణ్ విజువల్స్ బయటకు రావడంతో నేనే అంటూ ట్వీట్ చేసాడు . ఇంకేముంది పోలీస్ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు . ఇది పెద్ద కేసు కాదు కానీ రాజ్ తరుణ్ పై ఓ చిన్న మచ్ఛే అని చెప్పాలి .