అద్దె చెల్లించకుండా రౌడీయిజం చేస్తున్న నటుడు


ఒకరి ఇంట్లో కిరాయికి ఉంటూ సకాలంలో అద్దె చెల్లించకుండా ఆ యజమానిని ఇబ్బంది పెట్టడమే కాకుండా రౌడీయిజం చెలాయిస్తున్నాడట దాంతో అతడి భారీ నుండి నన్ను కాపాడండి అంటూ కోర్టు తో పాటుగా పోలీసులను కూడా ఆశ్రయించాడు ఆ ఇంటి యజమాని . ఇంతకీ అద్దె డబ్బులు ఇవ్వకుండా రౌడీయిజం చేస్తున్న నటుడు ఎవరో తెలుసా ……. కన్నడ నటుడుఆదిత్య ”.

కన్నడ చిత్రాల్లో నటించే ఆదిత్య ప్రసన్న అనే వ్యక్తికీ చెందిన ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు . బెంగుళూర్ లోని సదాశివనగర్ లో నాలుగేళ్లుగా అద్దెకు ఉంటున్న ఆదిత్య ఏడు నెలలుగా కిరాయి మాత్రం ఇవ్వడం లేదు . కిరాయి ఇవ్వకుండా యజమానికి దొంగమాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తుండటంతో నిలదీశాడట …… డబ్బులు చెల్లించాల్సిందే అని పట్టుబట్టాడట దాంతో ఆదిత్య అనే నటుడు రౌడీయిజం చేస్తూ నేను డబ్బులు ఇవ్వను ఇల్లు ఖాళీ చేయను ఏం చేస్తావో చేసుకో పో ! అంటూ యజమానిని బెదిరించడంతో న్యాయస్థానము తో పాటుగా పోలీసులను ఆశ్రయించాడు .