మిస్ బిహేవ్ చేసిన నిర్మాతపై కేసు నమోదు


case filed aganist raja meeru keka producer ramesh reddy

ఓ మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు గాను టాలీవుడ్ నిర్మాత పై కేసు నమోదు చేసారు పోలీసులు . సంఘటన వివరాలలోకి వెళితే ….. …. నందమూరి తారకరత్న , రేవంత్ , లాస్య ప్రధాన తారాగణం లో కృష్ణ కిషోర్ దర్శకత్వంలో రమేష్ రెడ్డి – రాజ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ” రాజా మీరు కేక ”. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ప్లాప్ అయ్యింది . దాంతో దర్శక నిర్మాతల మధ్య మనస్పర్థలు వచ్చాయి . నిర్మాతల్లో ఇద్దరు కావడంతో ఆ ఇద్దరి మధ్య కూడా విబేధాలు వచ్చాయి దాంతో నిర్మాతల్లో ఒకరైన రమేష్ రెడ్డి ఆ సినిమా కెమెరామెన్ గా పెట్టుకున్న రవిరెడ్డి కి 2 లక్షల పారితోషికం ఇచ్చాడట !

కాగా ఆ రెండు లక్షల రూపాయలను నాకు తిరిగి ఇవ్వాలని కెమెరామెన్ రవిరెడ్డి తో వాగ్వాదానికి దిగాడు . అంతేకాదు రవిరెడ్డి ఇంటికి వెళ్లి గొడవ చేయడమే కాకుండా రవిరెడ్డి భార్య తో అసభ్యంగా ప్రవర్తించడంతో వెంటనే బాధితులు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి రమేష్ రెడ్డి పై ఫిర్యాదు చేసారు . బాధితుల ఫిర్యాదు ని స్వీకరించిన పోలీసులు రమేష్ రెడ్డి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . లాభాలు వస్తాయని చిత్ర నిర్మాణంలోకి దిగితే లాభాల సంగతి దేవుడెరుగు పెట్టిన డబ్బులు పోయి కేసు కూడా నమోదు కావడంతో షాక్ కి గురయ్యాడు నిర్మాత రమేష్ రెడ్డి .

English Title: case filed aganist raja meeru keka producer ramesh reddy