బ‌న్నీ బ‌ర్త్‌డే వేడుక‌ల‌పై పోలీస్ కేసు!

బ‌న్నీ బ‌ర్త్‌డే వేడుక‌ల‌పై పోలీస్ కేసు!
బ‌న్నీ బ‌ర్త్‌డే వేడుక‌ల‌పై పోలీస్ కేసు!

స్టైలిష్ స్టార్ ట‌ర్న్డ్  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుక‌లు బుధ‌, గురువారాలు అభిమానుల కోలాహ‌లం మ‌ధ్య అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. బ‌ర్త్‌డే ముందు రోజు అంటే బుధ‌వారం జేఆర్సీ వేదిక‌గా బన్నీ అభిమానులకు ‘పుష్ప’ టీజర్ రూపంలో ట్రీట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీనికి బ‌న్నీ అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. దానితో సంతోషించిన బన్నీ అభిమానుల కోసం గురువారం ప్ర‌త్యేకంగా పుట్టిన రోజు వేడుక‌ల్ని కేబుల్ బ్రిడ్జి స‌మీపంలో నిర్విహించారు.

ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన లేజ‌ర్ షో విశేషంగా ఆక‌ట్టుకుంది. ఇందు కోసం భారీ సంఖ్య‌లో అభిమానులు లేజ‌ర్ షోకు హాజ‌ర‌య్యారు. అయితే ఇది సమస్యగా మారింది. వివరాల్లోకి వెళితే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ప్రశాంత్‌తో పాటు మరో అభిమాని సంతోష్ పేరుతో ఫైర్ క్రాకర్స్‌ని ఈ వేడుకలో కాల్చారు. కోవిడ్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా బాణాసంచా పేల్చ‌డంతో వీరిపై కేసు న‌మోదైంది.

తాజా సంఘ‌ట‌న‌పై స్పందించిన జూబ్లీ హిల్స్ పోలీసులు కోవిడ్ -19 నిబంధనలను దుర్వినియోగం చేసినందుకు గానూ,  క్రాకర్లను కాల్చడానికి అనుమతి తీసుకోనందుకు గానూ  ప్రశాంత్ మరియు సంతోష్‌పై కేసు నమోదు చేశారు. పబ్లిక్ కి అంత‌రాయం క‌లిగించారు కాబ‌ట్టి వీరిపై ఐపిసి 290, ఐపిసి 336 మరియు ఐపిసి 188 సెక్ష‌న్‌ల కింద‌ కేసు న‌మోదు చేశారు.