స్టార్ హీరోపై కేసు నమోదు


Hrithik Roshan
Hrithik Roshan

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పై హైదరాబాద్ లో కేసు నమోదు అయ్యింది . హృతిక్ రోషన్ కల్ట్ ఫిట్ నెస్ సెంటర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు . దాంతో హృతిక్ అభిమానులు పెద్ద ఎత్తున కల్ట్ ఫిట్ నెస్ సెంటర్ లో ఆన్ లైన్ లో పెద్ద ఎత్తున చేరారు . అయితే అలా చేరిన వాళ్లలో కొంతమందికి మాత్రమే స్లాట్ ఇస్తున్నారట మిగతా వాళ్ళు అందరూ వెయిట్ చేయాల్సి వస్తోంది పైగా ఏంటి ? అని ప్రశ్నించిన వాళ్ళని బ్లాక్ చేస్తున్నారట .

దాంతో హైదరాబాద్ లోని కూకట్ పల్లి కి చెందిన శశి అనే వ్యక్తి హృతిక్ రోషన్ పై కేసు పెట్టాడు . హృతిక్ ని చూసి మోసపోయామని అందుకే అతడిపైనే కేసు పెట్టాలని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసారు .