మహానటి కి కులం మరక అంటించారు


cast war on mahanati savitri

మహానటి చిత్రానికి కులం మరక అంటించారు అంతేకాదు మహానటి సావిత్రి చనిపోయి దాదాపు 38 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఆమెకు కూడా కుల మరక అంటించారు కొంతమంది కులపిచ్చి పట్టుకున్న ప్రబుద్ధులు . గతకొద్ది రోజులుగా సావిత్రి కులం ఏంటి ? ఆమెని ఆదరించిన వాళ్ళు ఎవరు ? చివరకు పెళ్లి చేసుకున్న కులస్థుడు ఎవరు ? అంటూ రకరకాల పిచ్చి ప్రశ్నలు వేస్తూ చర్చ లు కూడా చేస్తున్నారు .

సావిత్రి తన తండ్రి చిన్ననాటనే చనిపోవడంతో తన పెద్దనాన్న అయిన చౌదరి ఇంటికి బ్రతుకుదెరువు కోసం వెళ్ళారు . పెద్దనాన్న సంరక్షణ లోనే పెరిగి పెద్దదైన సావిత్రి ని నాటకాలకు అంతగా ఆదరణ లేకుండా పోవడంతో సినిమాల్లోకి తీసుకురావాలని మద్రాస్ కు తీసుకు వెళ్తాడు , కట్ చేస్తే కొన్ని ఇబ్బందుల తర్వాత సావిత్రి తిరుగులేని మహానటి అవుతుంది . అయితే ఇక్కడ ఇదంతా చర్చ ఎందుకు జరుగుతుందంటే కేవలం కుల చర్చ . సావిత్రి వాళ్ళది స్వతహాగా కాపు కులం కాగా సావిత్రి పెద్దమ్మ చౌదరి ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది దాంతో కమ్మ కులస్థుడైన చౌదరి చేరదీసాడు కాబట్టి కొంతమంది చౌదరి లని అనుకుంటారు కట్ చేస్తే ఆమె పెళ్లి చేసుకుంది తమిళ బ్రాహ్మిన్ అయిన జెమిని గణేశన్ ని దాంతో అసలు సావిత్రి ది ఏ కులం ? కాపు , కమ్మ , బ్రాహ్మణ అంటూ చర్చ చేస్తున్నారు , కుల మరక అంటిస్తున్నారు . హతవిధీ ……. !