ప్రభాస్ ని అంటుకున్న కుల వివాదం


Prabhas
Prabhas

తెలుగు చిత్ర రంగంలో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అన్న విషయం తెలిసిందే. తెలుగు చిత్రపరిశ్రమలో మొదటి నుండి కుల ప్రభావం ఉంది అయితే ఈమధ్య అది మరింతగా ముదిరింది. తాజాగా ప్రభాస్ ని ఈ కుల వివాదంలోకి లాగాడు వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ. ప్రభాస్ నా కులమే ! అని వర్మ పేర్కొనడం ఈ కుల వివాదానికి దారితీసింది.

ప్రభాస్ నటించిన సాహో విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ఈ కుల వివాదం ప్రభాస్ ని చుట్టుకోవడం పెద్ద చర్చకు దారితీసింది. కుల రగడ వల్ల సాహో కు కొంత నష్టమే జరిగే అవకాశం ఉంటుంది అయినప్పటికీ వర్మ ఇలా ఎందుకు చేసాడో అన్న అనుమానం నెలకొంది. రాంగోపాల్ వర్మ ట్వీట్ కి అనుగుణంగా మరో అభిమాని కూడా ట్వీట్ చేయడం విశేషం.

చిత్ర పరిశ్రమలో ప్రభాస్ , కృష్ణంరాజు , రాంగోపాల్ వర్మ , రవితేజ , అజయ్ భూపతి , సునీల్ , సుధీర్ వర్మ , తదితరులంతా రాజుల కులం అంటూ ప్రభాస్ అభిమాని పోస్ట్ చేయడం విశేషం. ఈ కుల పంచాయితీ ఎలా ఉన్నప్పటికీ సాహో ఈనెల 30 న విడుదలకు సిద్ధమైంది.