కాస్టింగ్ కౌచ్ బారినపడిన మహిళా గీత రచయిత


కాస్టింగ్ కౌచ్ బారినపడిన మహిళా గీత రచయిత
కాస్టింగ్ కౌచ్ బారినపడిన మహిళా గీత రచయిత

లైఫ్ లో సెటిల్ కావాలంటే నేను చెప్పినట్లు విను , ఫలానా వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్లకు ఆ ….. సుఖం అందిస్తే నీ లైఫ్ సెట్ అవుతుంది ఇలా పాటలు రాస్తానని ఆ ఆఫీసు ఈ ఆఫీసు తిరగాల్సిన అవసరం లేదు అంటూ మహిళా గీత రచయిత శ్రేష్ఠ కు ఓ దర్శకుడు కమ్ నిర్మాత భార్య సలహా ఇచ్చిందట ! దాంతో ఖంగుతిన్న శ్రేష్ఠ కొంతకాలం మౌనంగా ఉన్నప్పటికీ తాజాగా ఈ సంచలన వ్యాఖ్యలు చేసి హీరోయిన్ లు మాత్రమే కాస్టింగ్ కౌచ్ కు బలిఅవుతున్నారు అని అనుకుంటున్నారు. ఈ ఘోరం మాకు కూడా ఎదురయ్యింది, మేము కూడా ఇబ్బంది పడుతున్నాం అని అంటోంది శ్రేష్ఠ .

పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి ,తాజాగా అభిమన్యుడు చిత్రాలకు పాటలను అందించింది శ్రేష్ఠ . సినిమారంగంలో ఇలాంటివి చూసి షాక్ అయ్యానని అందునా ఓ మహిళ సాటి మహిళకు అండగా నివాల్సింది పోయి ఎవడి పక్కలోనో పడుకోమని డబ్బులు సంపాదించుకోమని సలహాలు ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది . మగవాళ్ళు వేషాలు వేస్తే వాళ్ళని ఎలాగో అలా కట్టడి చేయొచ్చని కానీ ఇలాంటి లేడీ కిలాడీ లను కట్టడి చేయడం చాలా చాలా కష్టమని తన బాధని వెళ్లగక్కుతోంది పాపం శ్రేష్ఠ . అయితే ఆ మహిళ ఎవరు ? అనే విషయం మాత్రం వెల్లడించడం లేదు .