అంధధూన్ రీమేక్ కు కొత్త అడ్డంకులు



అంధధూన్ రీమేక్ కు కొత్త అడ్డంకులు
అంధధూన్ రీమేక్ కు కొత్త అడ్డంకులు

నితిన్ ఇటీవలే భీష్మ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెల్సిందే. వరస ప్లాపుల నుండి భీష్మతో కంబ్యాక్ ఇచ్చిన నితిన్, ఇప్పుడు వరస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నితిన్ నటించే సినిమాలు రంగ్ దే, చెక్ సెట్స్ పై ఉన్నాయి. ఈ రెండూ కాకుండా బాలీవుడ్ సూపర్ హిట్ అంధధూన్ రీమేక్ ను కూడా నితిన్ చేయనున్న విషయం తెల్సిందే. ఆయుష్మాన్ ఖురానా పోషించిన అంధుడి పాత్రను నితిన్ తెలుగులో చేయనున్నాడు. మేర్లపాక గాంధీని దర్శకుడిగా సెలెక్ట్ చేసి చిత్రాన్ని లాంచ్ చేసారు కూడా. జులై నుండి ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని భావించారు.

అయితే లాక్ డౌన్ కారణంగా సినిమాల షూటింగ్ లు అన్నీ వాయిదా పడడంతో అంధధూన్ ప్రాజెక్ట్ కూడా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయింది. ఇక ఈ సినిమా కాస్టింగ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు టీమ్. ముఖ్యంగా టబు పోషించిన పాత్రకు ఎవరిని తీసుకోవాలన్న మీమాంస ఇంకా కంటిన్యూ అవుతోంది. ముందు టబునే తీసుకుందాం అనుకున్నారు కానీ ఆమె ఒప్పుకోలేదు. సో శిల్పా శెట్టి, రమ్య కృష్ణ ఇలా పలువురిని సంప్రదించారు కానీ ఎవరూ కూడా ఈ చిత్రాన్ని చేయడానికి ఒప్పుకోలేదు.

దీంతో కాస్టింగ్ విషయం మళ్ళీ మొదటికి వచ్చినట్లైంది. మరి ఫైనల్ గా టబు పోషించిన పాత్రకు ఎవరు సెలెక్ట్ అవుతారో చూడాలి.