కేథ‌రిన్ మొత్తానికి రాజీకొచ్చేసిందా?

Catherine demanding crore for Balakrsina movie
Catherine demanding crore for Balakrsina movie

డిమాండ్ వుండ‌గానే త‌మ ప‌ని తాము చేసుకుపోవాల‌ని చాలా మంది చూస్తుంటారు. సినిమాల్లో అయితే దీన్నే ప్రామాణికంగా తీసుని న‌టీన‌టుల‌కు అవ‌కాశాలు, రెమ్యున‌రేష‌న్‌లు వుంటాయి. వ‌న్స్ డిమాండ్ త‌గ్గిందా? ప‌ట్టించుకునే వారే వుండ‌రు. అందుకే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడే దండుకోవాల‌ని స్టార్ హీరోల నుంచి స్టార్ హీరోయిన్‌ల వ‌రు పారితోషికాల విష‌యంలో పోటీప‌డుతుంటారు. ఒక సినిమాకి 70 తీసుకుంటే మ‌రో సినిమాకు దానికి మించి వ‌సూలు చేస్తుంటారు.

యంగ్ హీరోయిన్ కేథ‌రిన్ కూడా ఆ విష‌యంలో త‌క్కువేవీ కాదు. దీపం వుండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాలని చూస్తోంది. ఒక్కో సినిమాకు దాదాపు 50 నుంచి 60 ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకున్న కేథ‌రిన్ తాజా చిత్రం కోపం మాత్రం కోటి డిమాండ్ చేసింద‌ట‌. నంద‌మూరి బాల‌కృష్ణతో బోయ‌పాటి శ్రీ‌ను మ‌రోసారి క‌లిసి ప‌నిచేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సినిమా ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.

ఇందులో రెండ‌వ నాయిక‌గా కేథ‌రిన్‌ని చిత్ర బృందం ఖ‌రారు చేసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ పాత్ర కోసం కేథ‌రిన్ కోటి డిమాండ్ చేసింద‌ట‌. అంత ఇచ్చుకోలేమ‌ని కేథ‌రిన్‌తో వాదించిన దర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను చివ‌రికి 80కి సెట్ చేశాడ‌ట‌. దీంతో చేసేది లేక కేథ‌రిన్ రాజీకొచ్చి ఓకే అన్న‌ట్టు ఫిలింన‌గ‌ర్ టాక్‌. ఇందులో బాల‌య్య‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ సొనాక్షిసిన్హా న‌టించే అవ‌కాశం వుంద‌ని వార్తు షికారు చేశాయి. అందులో ఎలాంటి వాస్త‌వం లేద‌ని సొనాక్షి క్లారిటీ ఇవ్వ‌డం తెలిసిందే.