బాలయ్య సినిమా గురించి అడిగితే తెలీదు అనేసింది


బాలయ్య సినిమా గురించి అడిగితే తెలీదు అనేసింది
బాలయ్య సినిమా గురించి అడిగితే తెలీదు అనేసింది

క్యాథెరిన్ ట్రెసా.. టాలీవుడ్ లో పలు హిట్ సినిమాల్లో నటించింది క్యాథెరిన్. అయితే బాగా గుర్తింపు తెచ్చిన సినిమా ఏదంటే సరైనోడు సినిమాలో చేసిన ఎమ్మెల్యే పాత్ర అనే చెప్పాలి. ముఖ్యంగా యూ ఆర్ మై ఎమ్మెల్యే సాంగ్ తో తెగ పాపులర్ అయిపొయింది. ఆ తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమాలో కూడా క్యాథెరిన్ కీలకమైన పాత్రే చేసింది. ఏదైనా పోష్ పాత్ర ఉందంటే ముందుగా టాలీవుడ్ కు క్యాథెరిన్ గుర్తొస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు తర్వాత జయ జానకి నాయక సినిమాలో కూడా ఒక రోల్ చేసింది ఈమె. అయితే తాజాగా క్యాథెరిన్ ను బాలయ్య సినిమాలో ఒక ప్రముఖ పాత్రకు తీసుకున్నారు అంటూ ఒక వార్త మొదలైంది. అయితే ఇది నిజమో కాదో క్లారిటీ అయితే లేదు. ఉందని ఒక వార్త, లేదని మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది నిజమో కాదో తేల్చుకోవాలంటే బోయపాటి శ్రీను కానీ బాలయ్య కానీ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కానీ అందుబాటులో లేరు.

అయితే ఎట్టకేలకు క్యాథెరిన్ అందుబాటులోకి వచ్చింది. ఆమె లేటెస్ట్ గా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు మీడియాతో ఏర్పాటైన సమావేశంలో క్యాథెరిన్ పాల్గొంది. ఇదే సందర్భమని చెప్పి విలేఖరులు కూడా బాలయ్య సినిమా విషయమై స్పందించారు. ఈ సినిమాలో మీరు నటిస్తున్నారట కదా అని అడిగారు. దానికి ఈ హీరోయిన్ నుండి వింత సమాధానం వచ్చింది.

ఈ వార్తలను నేను కూడా చదివాను. ఈ సినిమాలో నేను నటిస్తున్నానంటూ రాసారు. ఈ విషయమై చిత్ర బృందం సంప్రదించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఎక్కడికెళ్లినా నన్ను ఇదే విషయం అడుగుతున్నారు. వాళ్లకు నేను చెప్పేది ఒకటే. నేను ఈ చిత్రంలో నటిస్తున్నానో లేదో నన్ను కాదు ఆ చిత్ర నిర్మాతను అడగండి లేదా దర్శకుడ్ని అడగండి అని ఆమె అంది. అంటే సినిమాలో ఆమె ఉందనుకోవాలా లేదనుకోవాలా?