హీరోయిన్ మోజులో పడ్డ డైరెక్టర్

Catherine tresa item song in Vinaya Vidheya Rama హాట్ భామ కేథరిన్ ట్రెసా అంటే పడి చచ్చిపోతున్నాడు దర్శకులు బోయపాటి శ్రీను . తాజాగా తన వినయ విధేయ రామ చిత్రంలో ఈ హాట్ భామ చేత ఐటెం సాంగ్ చేయిస్తున్నాడు . ఇప్పటికే తన సినిమాల్లో కేథరిన్ కు రెండుసార్లు వరుసగా ఛాన్స్ ఇచ్చాడు బోయపాటి . అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన జయ జానకి నాయక చిత్రంలో కేవలం ఐటెం సాంగ్ మాత్రం చేయించాడు బోయపాటి . కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ వినయ విధేయ రామ చిత్రంలో కేథరిన్ ట్రెసా చేత ఐటెం సాంగ్ చేయించడానికి రెడీ అవుతున్నాడు .

అసలు ఈ చిత్రంలో ఇలియానా చేత ఐటెం సాంగ్ చేయించాలని భావించారు . ఇలియానాని అడిగారు కూడా కానీ ఆమె 60 లక్షల రెమ్యునరేషన్ విని షాక్ అయ్యారు దాంతో కేథరిన్ ని తీసుకుందామని చరణ్ కు చెప్పాడట బోయపాటి శ్రీను . కేథరిన్ అంటే కాస్త మక్కువ ఏర్పడటంతో ఆ భామతో చేద్దామని చరణ్ ని ఒప్పించాడట . బోయపాటి కోరిక మేరకు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది . ఇక ఈ చిత్రాన్ని 2019 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: Catherine tresa item song in Vinaya Vidheya Rama