విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయనున్న కేథరిన్

Catherine tresa ready to romance with Vijay devarakonda హాట్ భామ కేథరిన్ ట్రెసా తో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ . తాజాగా ఈ హీరో క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కె ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది . లేబర్ లీడర్ గా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు . కాగా సింగరేణి కార్మికుల నేపథ్యంలో పలు సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు దర్శకులు.

 

కాగా ఈ చిత్రంలో ఇప్పటికే రాశి ఖన్నా , ఐశ్వర్య రాజేష్ లను ఎంపిక చేయగా మరో హీరోయిన్ గా కేథరిన్ ట్రెసా ని ఎంపిక చేసారు . టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు హాట్ ఇమేజ్ అయితే  వచ్చింది కానీ సాలిడ్ హిట్స్ మాత్రం దక్కడం లేదు అలాగే హీరోయిన్ గా స్టార్ డం పొందాలని ఆశపడుతోంది కానీ అది కూడా దక్కడం లేదు . ఇప్పుడు విజయ్ దేవరకొండ రూపంలోనైనా ఈ భామకు  సాలిడ్ హిట్ దక్కుతుందేమో చూడాలి.

English Title: Catherine tresa ready to romance with Vijay devarakonda