కావేరి పిలుస్తుంది మనం చేయాలనుకున్నది చేసేద్దాం!


Cauvery is calling, do whatever our duty!
Cauvery is calling, do whatever our duty!

ప్రకృతి అంటే అందం, అభినయం , కనుల విందు అని చాలా కవితల రూపంలో,  బుక్స్ నొవెల్స్ లో, మంచి మంచి సినిమాలలో చూసి ఉంటాం. కానీ ఎప్పుడైతే ప్రకృతి వీపరీతం గా చలించి పోతుందో ఆపడం బ్రహ్మ తరం కూడా కాదు అని మన పెద్దలు చెప్పారు. కొద్దీ రోజుల క్రితం చూసినట్లు అయితే “అమెజాన్ అడవులు” వాటంతట అవి అగ్ని ప్రమాదం జరగడం, వరుణ దేవుడు కరుణించి ఆ అడవులని అగ్ని ప్రమాదం నుండి కాపాడడం మామూలు విషయం కాదు.

కానీ ఎప్పుడైతే తమిళనాడు-కర్ణాటక దగ్గర వున్న కావేరి నదిని నీరు లేకుండా ఉండటం చూసామో, అమెజాన్ అడవుల కంటే కూడా గోరా పరాభవం. ఇక రెండు రాష్ట్లాల గవర్నమెంట్ స్పందించిందో లేదో కానీ మన సెలెబ్రెటీస్ అయిన “కంగనా రనౌత్ “, “తమన్నా భాటియా“, “కాజల్ అగర్వాల్” తమ వంతుగా “Cauvery Calling (కావేరి పిలుస్తుంది )” అని ఒక హాష్ ట్యాగ్ ని ప్రచారం చేశారు, అది అంతింత అయ్యి ఇప్పుడు సభ్య సమాజాన్ని సైతం మేల్కొలిపేలా చేస్తుంది.

ఇక ఒక్కసారి ఏదైనా న్యూస్ లో వచ్చిందంటే సాటి మానవాళి కూడా స్పందిస్తుంది కాబట్టి, మన కర్తవ్యాలని గుర్తుచేసుకుందాం అంటూ ఒక వెబ్-సైట్ ని రంగం లోకి దింపారు, అందులో ఎవరైనా సరే రిజిస్టర్ అయ్యి ఆ ప్రకృతి ని ఇంతకు ముందు లాగ చేయొచ్చు, మానవాళి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు కాబట్టి పదండి ఒక అడుగు కావేరి నది వైపు  వేద్దాం.