సుశాంత్ కేసులో స్పీడు పెంచిన సీబీఐ! 

CBI found five key witnesses in sushant case
CBI found five key witnesses in sushant case

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద మృతి కేసు థ్రిల్ల‌ర్ సినిమాని త‌ల‌పిస్తోంది. ఈ కేసు విష‌యంలో త‌వ్వినా కొద్దీ కొత్త ట్విస్ట్‌లు బ‌య‌ట‌ప‌డుతూనే వున్నాయి. ఈ కేసుని కేంద్రం సీబీఐకి అప్ప‌గించిన విష‌యం తెలిసిందే. సుశాంత్ కేసులో ఐదుగురిని సాక్షులుగా గుర్తించిన సీబీఐ వారిపై నిఘా పెట్టినట్టు చెబుతున్నారు. ఆ ఐదుగురు ఎవ‌రంటే.. సుశాంత్ ల‌వ‌ర్ రియా చ‌క్ర‌వ‌ర్తి, సోద‌రి మీతూ సింగ్‌, ఫ్రెండ్ సిద్ధార్థ్ పితాని, ఫ్లాట్ మేనేజ‌ర్ శామ్యూల్ మిరండా..ల‌తో పాటు మ‌రో వ్య‌క్తిపై కూడా సీబీఐ నిఘా పెట్టిన‌ట్టు చెబుతున్నారు.

వీరంతా సుశాంత్ మ‌రణించిన రోజైన జూలై 14న అక్క‌డే వున్నారట‌. ఘ‌ట‌నా స్థ‌లంలో పోలీసుల కంటే ముందే వీరున్నార‌ని, అలాగే పోలీసులు స్పాట్‌కు చేర‌క‌ముందే సుశాంత్ బాడీని కింద‌కి దించి బెడ్‌పై ప‌డుకోబెట్టార‌ట‌. ఇలా ఎందుకు చేశార‌న్న‌దానిపై వారి నుంచి స్ప‌ష్ట‌మైన స‌మాచారం కోసం సీబీఐ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలిసింది.

సుశాంత్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణంతో 56 మందికి సంబంధం వున్న‌ట్టు పోలీసుల ప్రాధ‌మిక విచార‌ణ‌లో తేలింది. ఈ కేసు కీల‌క మ‌లుపు తిర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం సుశాంత్ తండ్రి కెకె సింగ్ . త‌న త‌న‌యుడి హ‌త్య వెన‌క భారీ కుట్ర జ‌రిగింద‌ని ఆరోపిస్తూ పాట్నా స్టేష‌న్‌లో రియాపై కేసు ఫైల్ చేయ‌డంతో సుశాంత్ కేసు కీల‌క మ‌లుపు తిరిగింది. కెకె సింగ్ అభ్య‌ర్థ‌న మేర‌కే బీహార్ ప్ర‌భుత్వం సుశాంత్ కేసుని సీబీఐకి అప్ప‌గించ‌డంతో ప‌లు కీల‌క విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.