చిరు ఇంట్లో మ‌ళ్లీ మీటింగ్.. బాల‌య్య ప్ర‌స్తావ‌న లేదా?


చిరు ఇంట్లో మ‌ళ్లీ మీటింగ్.. బాల‌య్య ప్ర‌స్తావ‌న లేదా?
చిరు ఇంట్లో మ‌ళ్లీ మీటింగ్.. బాల‌య్య ప్ర‌స్తావ‌న లేదా?

టాలీవుడ్‌లో షూటింగ్‌లు, థియేట‌ర్లు పునః ప్రారంభం కోసం గ‌త కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ ప్ర‌ముఖులు తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రిని, ఆ త‌రువాత ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ని ప్ర‌త్యేకంగా క‌లిసి తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై విన్న వించిన విష‌యం తెలిసిందే. దీనికి రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి సానుకూల స్పంద‌న వ‌చ్చింది. అయితే ఈ సంద‌ర్భంగా హీరో బాల‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లాన్ని సృష్టించాయి.

ఈ నేప‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవి నివాసంలో మ‌రోసారి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ప్ర‌త్యేకంగా స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. అయితే ఈ మీటింగ్‌లో బాల‌య్య ప్ర‌స్థావ‌న రాలేద‌ని తెలిసింది. ముఖ్యంగా ఈ స‌మావేశం సీసీసీ ద్వారా మ‌రో సారి నిత్యావ‌స‌రాల‌ని అందించ‌డం, ప్ర‌భుత్వం షూటింగ్‌ల‌కు అనుమ‌తులిస్తే ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి? అనే దానిపై మాత్ర‌మే చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలిసింది.

అయితే బాల‌కృష్ణ వ్యాఖ్య‌ల‌పై మాత్రం సీసీసీ మీటింగ్‌లో చ‌ర్చించ‌లేద‌ని, తొలి విడ‌త స‌రుకుల పంపిణీపై మాత్ర‌మే రివ్యూ మీటింగ్ జ‌రిగిన‌ట్టు తెలిసింది. ఇక బాల‌య్య వ్యాఖ్య‌ల‌పై త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్పందించారు. అవ‌స‌రం వున్న వాళ్ల‌నే ఇటీవ‌ల జ‌రిగిన మీటింగ్‌ల‌కు పిలిచార‌ని, దీన్ని వివాదం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, నాగ‌బాబు వ్యాఖ్య‌లు ఆయ‌న వ్య‌క్తిగ‌త‌మ‌ని వెల్ల‌డించారు.