వర్మ ల్యాప్ టాప్ ని సీజ్ చేసిన పోలీసులు


ccs-police-seized-varmas-laptop

గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ విషయంలో దర్శకులు రాంగోపాల్ వర్మ ని ప్రశ్నించారు పోలీసులు . 25 నుండి 30 ప్రశ్నల వరకు వర్మ పై సంధించారు సిసిఎస్ పోలీసులు అయితే పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలి లో తికమక సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది దాంతో అతడి ల్యాప్ టాప్ ని సీజ్ చేసారు పోలీసులు . మళ్ళీ విచారణకు వచ్చే శుక్రవారం రావాలని రాంగోపాల్ వర్మ ని ఆదేశించారు పోలీసులు .

మియా మల్కోవా తో చేసిన జి ఎస్ టి ఎక్కడ తీశారు ? నగ్న చిత్రాలు ఎప్పుడు తీశారు ? జి ఎస్ టి చిత్రాన్ని ఎక్కడ అప్ లోడ్ చేసారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కానీ వర్మ మాత్రం సంతృప్తి కరమైన సమాధానాలు ఇవ్వలేదు ఇదే రకంగా వచ్చే శుక్రవారం కూడా సమాధానాలు ఇస్తే వర్మ అరెస్ట్ తప్పక పోవచ్చని భావిస్తున్నారు . సామాజిక కార్యకర్త దేవి ఇచ్చిన ఫిర్యాదు తో వర్మ ఇలా పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు .