సుకుమార్ ఇంట తార‌ల సంద‌డి!

సుకుమార్ ఇంట తార‌ల సంద‌డి!
సుకుమార్ ఇంట తార‌ల సంద‌డి!

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌ల‌లో సుకుమార్ ది ప్ర‌త్యేక శైలి. ప్ర‌స్తుతం `అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియయా స్థాయిలో `పుష్ప‌` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌కి ప్ర‌స్తుతం బ్రేకిచ్చారు. దీంతో హీరో బ‌న్నీ ఫ్యామిలీతో క‌లిసి దుబాయ్‌లో విహ‌రిస్తున్నారు. సుకుమార్ మాత్రం తాను స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన `ఉప్పెన‌` స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ టీమ్‌తో సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు.

ఇదిలా వుంటే నిత్యం బిజీగా వుండే సుకుమార్ ఇంట ఓ శుభ‌కార్య జ‌రిగింది. ఈ శుభ‌కార్యానికి తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖ నటీన‌టులు హాజ‌రై సంద‌డి చేశారు. సుకుమార్ కుమార్తె సుకృతి వేణి వోణీ ఫంక్ష‌న్ బుధ‌వారం సాయంత్రం తార‌ల త‌ళుకుల మ‌ధ్య అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. న‌గ‌రంలోని ఓ పాపుల‌ర్ ఫంక్ష‌న్ హాల్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు స్టార్స్ హాజ‌ర‌య్యారు.

ఈ ఫంక్ష‌న్‌లో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు, న‌మ్ర‌త‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – ప్ర‌ణ‌తి, నాగ‌చైత‌న్య – స‌మంత దంప‌తుల‌తో పాటు కృతిశెట్టి, హీరో రామ్‌, సాయి ధ‌ర‌మ్‌తేజ్‌, వైష్ణ‌వ్‌తేజ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, కీర్తిసురేష్‌, అన‌సూయ వంటి వారంతా హాజ‌రై సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ని ఆశీర్వ‌దించారు. మ‌హేష్‌, ఎన్టీఆర్ ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో స‌ర‌దాగా మాట్లాడారు. ఈ ఫంక్ష‌న్‌కి సంబంధించిన ఫొటోలు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి.