దేశ వ్యాప్తంగా హై అలర్ట్ !


Article 370
Article 370

దేశ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం . ఆర్టికల్ 370 రద్దు చేసిన నేపథ్యంలో అలాగే ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్రం . ఉగ్రవాదులు విమానాశ్రయాలను టార్గెట్ గా ఎంచుకొని దాడులకు పాల్పడే ఛాన్స్ ఉందని హెచ్చరికలు జారీ చేసారు .

కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో అప్రమత్తమైన రాష్ట్రాలు ఎయిర్ పోర్ట్ లలో తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి . ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో పాకిస్థాన్ భారత్ పై విషం కక్కుతున్న విషయం తెలిసిందే . ఆర్టికల్ 370 రద్దుపై ఐక్యరాజ్యసమితి ని ఆశ్రయించాలని నిర్ణయించింది పాకిస్థాన్ .