చైతూ `ల‌వ్ స్టోరీ` వాయిదా ప‌డింది!

చైతూ `ల‌వ్ స్టోరీ` వాయిదా ప‌డింది!
చైతూ `ల‌వ్ స్టోరీ` వాయిదా ప‌డింది!

నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న చిత్రం `ల‌వ్‌స్టోరీ`. సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం పాట‌ల‌తో ఇప్ప‌టికే టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ఈ చిత్రంలోని `సారంగ ద‌రియా` సాంగ్ ఇప్ప‌టికే యూట్యూబ్‌లో అత్యంత త‌క్కువ స‌మ‌యంలో 100 మిలియ‌న్ వ్యూస్ ని క్రాస్ చేసిన సాంగ్‌గా రికార్డు సృష్టించింది.

ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీని ఈ నెల 16న విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేసింది. కానీ గ‌త కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ చిత్ర రిలీజ్‌ని వాయిదా వేస్తున్న‌ట్టు మేక‌ర్స్ గురువారం సాయంత్రం ప్ర‌క‌టించారు. వీలైనంత త్వ‌ర‌గా కొత్త రిలీజ్ డేట్‌ని త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌ని మేక‌ర్స్  తెలిజేశారు.

థియేట‌ర్ల‌లో సినిమా చూడాలని వేచి చూశాం. పాండ‌మిక్ త‌రువాత ఏడాది పాటు వేచి చూశాం. సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాం. రెండు, మూడు రోజుల నుంచి కోవిడ్ ప‌రిస్థితుల్ని గ‌మ‌నిస్తున్నాం. మేము అనుకున్న ఏప్రిల్ 16వ తేదీకి ఈ కేసుల సంఖ్య ఇంకా పెరిగేలా వుంది. ఇది అంద‌రూ హ్యాపీగా చూడాల్సిన సినిమా. కోవిడ్ వ‌ల్ల వాళ్లంతా థియేట‌ర్ల‌కు రాక‌పోవ‌చ్చు. డిస్ట్రిబ్యూట‌ర్స్ అంద‌రితో మాట్లాడాము. సినిమా రెడీగా వుంది. వీలైనంత త్వ‌ర‌గా చిత్రాన్ని విడుద‌ల చేస్తాం` అని ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల తెలిపారు.