చలాకి చంటి కి భారీ యాక్సిడెంట్


chalaki chanti great ascape from car accident

జబర్దస్త్ తో తెలుగునాట బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన చలాకి చంటి భారీ యాక్సిడెంట్ కి గురయ్యాడు . అయితే ఆ యాక్సిడెంట్ నుండి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు దాంతో చలాకి చంటి తో పాటు అతడి కుటుంబం ఊపిరి పీల్చుకున్నారు . సంఘటన వివరాలలోకి వెళితే …… ….. మహబూబ్ నగర్ హైవే పై కారులో ప్రయాణిస్తున్నాడు చలాకి చంటి , అయితే వెనుక నుండి ఓ కారు అత్యంత వేగంగా వచ్చి చంటి కారు ని గుద్దడంతో భారీ యాక్సిడెంట్ జరిగింది .

వేగంగా కారు గుద్దడంతో రెండు కార్లు కూడా బాగా దెబ్బతిన్నాయి , ఇక కారులో ఉన్న చంటి కి స్వల్ప గాయాలయ్యాయి దాంతో వెంటనే చంటి కి ప్రాథమిక చికిత్స అందించారు . యాక్సిడెంట్ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు . టివి షోలలోనే కాకుండా పలు చిత్రాల్లో కూడా నటించాడు చంటి . అయితే జబర్దస్త్ తోనే ఎక్కువ ప్రాచుర్యం పొందాడు చలాకి చంటి .