గోపీచంద్ చాణక్య నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్.. డీసెంట్

chanakya non theatrical rights
chanakya non theatrical rights

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ చాణక్య, చిరంజీవి సైరాకు పోటీగా మరో మూడు రోజుల్లో విడుదల కానున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం ప్రోమోలతో ప్రేక్షకులలో బాగానే ఆసక్తి కలిగించిన నేపథ్యంలో సినిమా మీద ఆసక్తి పెరిగింది. దసరా సీజన్ లో విడుదలవుతున్న ఈ సినిమాపై బయ్యర్లు కూడా బాగానే పెట్టుబడి పెట్టారు.

ప్లాపుల్లో ఉన్నా కానీ గోపీచంద్ చిత్రంపై నిర్మాతలు బాగా ఖర్చు పెట్టారు. తిరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ ఇటీవలే క్లోజ్ అయింది. సాటిలైట్ రైట్స్ ను మాటీవీ దక్కించుకుంది. డిజిటల్ రైట్స్ అమెజాన్ కు దక్కాయి. ఈ రెండిటికీ కలిపి దాదాపు 6 కోట్ల వరకూ నిర్మాతకు ముట్టినట్లు తెలుస్తోంది.

ఇక ఇది యాక్షన్ స్పై థ్రిల్లర్ కాబట్టి బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. అందుకే హిందీ డబ్బింగ్ రైట్స్ కు 9 కోట్ల వరకూ పలికింది. అంటే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే చాణక్య 15 కోట్లు సంపాదించింది. ఇక సినిమా ఏమాత్రం బాగున్నా అందరికీ ఇది ప్రాఫిటబుల్ వెంచర్ అవుతుంది అనడంలో సందేహం లేదు.