సెప్టెంబర్ 2న గోపీచంద్ “చాణక్య” టీజర్


chanakya tease
chanakya tease

ఎగ్రెసివ్ హీరో గోపిచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తోన్న చిత్రం “చాణక్య”. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో మెహరీన్, జరీనాఖాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

తమిళ దర్శకుడు తిరు ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. కాగా ఈ చిత్రం టీజర్ ని సెప్టెంబర్ 2న వినాయక చతుర్థి నాడు విడుదల చేయనున్నారు.. టైటిల్ కి తగ్గట్లుగానే గోపీచంద్ పవర్ ఫుల్ క్యారెక్టర్లో నటిస్తున్నట్లు సమాచారం.

ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. బ్యాలెన్స్ ఉన్న రెండు పాటల్ని యూరప్లో చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం ఈచిత్రం డబ్బింగ్ జరుపుకుంటుంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.