ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఎవరో తెలుసా


chandrababu naidu happy with lagadapati rajagopal survey

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ అధికార పీఠాన్ని అందుకునేది తెలుగుదేశం పార్టీ అని తాజా సర్వే చెబుతోంది . సర్వే లలో మాజీ పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్ సర్వే ని ఎక్కువ శాతం మంది నమ్ముతారు ఎందుకంటే అతడు ఇప్పటివరకు చేసిన అన్ని సర్వే ఫలితాలు నిజమయ్యాయి అంతేకాదు చెప్పిన ఫిగర్ కూడా దాదాపుగా మ్యాచ్ అవుతూనే ఉంది . తాజాగా లగడపాటి ఆంధ్రప్రదేశ్ లో చేసిన సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ 110 సీట్లతో మళ్ళీ అధికారం అందుకోవడం ఖాయమని , జగన్ పార్టీ 60 సీట్లకే పరిమితం కానుందని తేల్చి పడేసాడు లగడపాటి .

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే కొంత వరకు ఓట్ల శాతం సంపాదించుకున్నాడు కానీ సీట్లు మాత్రం పెద్దగా రావడం లేదు . వస్తే గిస్తే 5 సీట్లు వస్తాయట పవన్ కళ్యాణ్ కు . ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా తెలుగుదేశం కు 110 , జగన్ పార్టీ కి 60 , ఇతరులు 5 స్థానాలు గెల్చుకుంటారని లగడపాటి రాజగోపాల్ సర్వే లో తేలింది . అయితే ఈ సర్వే ఇలా ఉండగా జనాల్లో మాత్రం జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని , చంద్రబాబు అధికారం కోల్పోవడం ఖాయమని అంటున్నారు .