చంద్రబోస్ ఇంట విషాదంప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది . చంద్రబోస్ తల్లి మదనమ్మ గుండెపోటుతో మరణించింది . దాంతో చంద్రబోస్ ఇంట విషాదం నెలకొంది . చంద్రబోస్ స్వస్థలం వరంగల్ జిల్లా పరకాల సమీపంలోని చల్లగరిగె గ్రామం దాంతో స్వగ్రామంలోనే అంత్యక్రియలను నిర్వహించనున్నారు . చంద్రబోస్ తల్లి హైదరాబాద్ లో మరణించింది , పార్దీవ దేహాన్ని స్వగ్రామానికి తరలిస్తున్నారు .

మదనమ్మ కు నలుగురు సంతానం కాగా అందులో చంద్రబోస్ అందరి కంటే చిన్నవాడు . సినిమాలపై మక్కువతో పాటలు రాస్తూ అవకాశాలు దొరకబుచ్చుకున్నాడు . గేయ రచయితగా  అచిర కాలంలోనే చంద్రబోస్ తనదైన శైలితో తన ప్రత్యేకతని నిరూపించుకున్నాడు.  చంద్రబోస్ తల్లి మరణం విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు .