చంద్రమోహన్… ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్లే!!

చంద్రమోహన్... ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్లే!!
చంద్రమోహన్… ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్లే!!

తెలుగు సినిమా బ్లాక్ అండ్ వైట్ ఆర్టిస్టులలో ఇంకా యాక్టివ్ గా ఉన్నవారిలో చంద్రమోహన్ ఒకరు. ఆయన సినీ ప్రయాణం అసాధారణం. దాదాపు 55 సంవత్సరాల పాటు నటిస్తూనే ఉన్నారు. హీరోగానే కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చంద్రమోహన్ ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసారు. ఆయన నిన్నటితో 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని 81 సంవత్సరాల్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి కీలకమైన అప్డేట్ ను ఇచ్చారు. ఇకపై తాను నటించబోనని తేల్చి చెప్పేసారు.

ప్రస్తుతమున్న కోవిడ్ పరిస్థితులు, తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు చంద్రమోహన్. వయసు గురించి పట్టించుకోకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఇనుముకు చెదలు పడుతుందా అని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాను. నిర్మాతలకు ఇబ్బంది కలగకూడదని వయసును కూడా లెక్క చేయకుండా కొన్ని రిస్కులు కూడా చేశాను. ఇక చాలనిపిస్తోంది.

నేను సినిమాల్లో చేయకపోయినా రోజూ నేను నటించిన ఏదొక సినిమా టివిల్లో రోజూ వస్తున్నాయి. యూట్యూబ్ ద్వారా నా పాత చిత్రాలు చాలా అందుబాటులో ఉన్నాయి అని చెప్పుకొచ్చాడు చంద్రమోహన్.