యేలేటి సంగతి సరే… ఆ రిస్క్ తీసుకోవడానికి ప్రభాస్ సిద్ధమా?

యేలేటి సంగతి సరే... ఆ రిస్క్ తీసుకోవడానికి ప్రభాస్ సిద్ధమా?
యేలేటి సంగతి సరే… ఆ రిస్క్ తీసుకోవడానికి ప్రభాస్ సిద్ధమా?

టాలీవుడ్ లో విలక్షణ దర్శకులు అనదగ్గ వారు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అలాంటి దర్శకులలో ముందు వరసలో ఉంటారు చంద్రశేఖర్ యేలేటి. ఈ దర్శకుడు టాలెంట్ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. అయితే టాలెంట్ కు తగ్గ సక్సెస్ లు లేక ఇబ్బంది పడుతున్నాడు ఈ దర్శకుడు. అందుకే సినిమా సినిమాకూ చాలా సంవత్సరాల గ్యాప్ వస్తోంది. చాలా గ్యాప్ తర్వాత నితిన్ తో చెక్ తీసాడు యేలేటి. ఈ సినిమాపై హైప్ కూడా బాగానే వచ్చింది కానీ సినిమా నిరాశపరిచింది. కమర్షియల్ రిజల్ట్ సంగతి అటుంచితే యేలేటి మార్క్ మిస్ అవ్వడం పెద్ద ప్రతికూలత.

ఇదిలా ఉంటే ఈ దర్శకుడి నెక్స్ట్ సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికర రూమర్స్ వస్తున్నాయి. యేలేటికి మైత్రి మూవీ మేకర్స్ తో డీల్ ఉంది. అదే సంస్థ వద్ద ప్రభాస్ డేట్స్ కూడా ఉన్నాయి కానీ ఇంకా డైరెక్టర్ సెట్ అవ్వలేదు. ఇప్పుడు మన యేలేటి, మైత్రి ద్వారా ప్రభాస్ తో వర్క్ చేయాలని ప్లాన్ చేసాడు.

వినడానికి బాగానే ఉన్నా ఈ దర్శకుడు స్టార్స్ ను ఇప్పటివరకూ హ్యాండిల్ చేయలేదు. కంటెంట్ పక్కనపెడితే కమర్షియల్ గా సరైన సక్సెస్ లేదు. మరి కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ ఈ రిస్క్ తీసుకుంటాడా?