బన్నీ పుష్ప ప్లాన్ లో మార్పు వచ్చిందా?


బన్నీ పుష్ప ప్లాన్ లో మార్పు వచ్చిందా?
బన్నీ పుష్ప ప్లాన్ లో మార్పు వచ్చిందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చేయనున్న చిత్రం పుష్ప. ఈ చిత్ర షూటింగ్ కొన్ని నెలల క్రితమే మొదలుకావాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. చిత్తూర్ నేపథ్యంలో సాగే కథ పుష్ప. ఇందులో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా కనిపిస్తాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కథ నేపథ్యంలో సినిమా షూటింగ్ మెజారిటీ భాగం అంతా అడవుల్లో చిత్రీకరించాల్సి ఉంది. మొదటి షెడ్యూల్ ను కేరళలోని దట్టమైన అడవుల్లో చిత్రీకరించాలని ప్లాన్ చేసారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చు. కనీసం హైదరాబాద్ దగ్గర్లో ఉన్న వికారాబాద్ అడవుల్లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేద్దామనుకున్నారు. అయితే ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతిలిచ్చే క్రమంలో కొన్ని నిబంధనలు పెట్టనుంది.

వీటి వల్ల ఎక్కువ మంది సిబ్బంది షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదు. అవుట్ డోర్ షూటింగ్ అంటే ఎక్కువ మంది ఉండే అవకాశముంది. సో పుష్ప అండ్ టీమ్ రీసెంట్ గా మీట్ అయ్యి ప్లానింగ్ లో చేంజ్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మొదట అవుట్ డోర్ షూట్ కాకుండా సెట్స్ వేసి షూట్ చేసే అవకాశాలున్న సన్నివేశాల్ని మొదట చిత్రీకరించాలని డిసైడ్ అయ్యారట. దాని ప్రకారం సుకుమార్ అండ్ కో ఇప్పుడు షెడ్యూల్స్ లో మార్పులు చేస్తున్నారట. ఒకసారి పరిస్థితి అదుపులోకి వచ్చాక అప్పుడు అవుట్ డోర్ షూటింగ్ ను తిరిగి ప్లాన్ చేయవచ్చన్నది ప్లాన్.