కితకితలు కాదు… నిజమైన భాధ.


Geetha Singh
కితకితలు కాదు… నిజమైన భాధ.

“అల్లరి నరేష్” నటించిన “కితకితలు” సినిమా మన అందరికి బాగా గుర్తుంది. అందులో అల్లరి నరేష్ కి భార్యగా నటించిన “గీతా సింగ్ ” పాత్ర కూడా మనం మరువలేం. ఇక తన తండ్రి “ఈ.వి.వి సత్యనారాయణ” గారి దర్శకత్వంలో చేసిన కితకితలు సినిమా నరేష్ కి, హీరోయిన్ గా చేసిన నటి గీతా సింగ్ కి మంచి పేరు వచ్చింది. అలాగే ఆ సినిమా బెస్ట్ కామెడీ సినిమాలలో ఒకటిగా నిలిచింది.

ఆ సినిమా తర్వాత నటి గీతా సింగ్ గారు యధావిధిగా సినిమాలు చేస్కుంటూ వచ్చారు, అవి అంతగా పేరు తెచ్చిపెట్టలేదు. అయితే గీతా సినిమాలు చేయడం తగ్గించారు, అలాగే అవకాశాలు కూడా తక్కువగా వచ్చాయి. ఈ మధ్య జరిగిన బుల్లితెర ప్రోగ్రామ్ లో నటి గీతా గారు తన కుటుంబ సభ్యులతో హాజరు అయ్యారు, ఆ ప్రోగ్రామ్ కి సుమ గారు యాంకర్.

ఆ ప్రోగ్రామ్ కామెడీ పరంగా సాగే ఉద్దేశం, అయితే అప్పుడప్పుడు కొంతమంది సెలెబ్రెటీస్ తమ అనుభవాలని పంచుకుంటారు. అలాగే ప్రోగ్రాం చివరలో గీతా గారు కూడా అలా అనుభవాలని చెప్పుతూ, కన్నీరు పెట్టుకున్నారు.

కుటుంబం గురించి చెప్పుతూ కన్నీరు పెట్టుకున్నారు, అవి ఏంటంటే… వాళ్ళ తండ్రి చిన్నప్పుడే చనిపోయారు, తల్లి ఒక్కతే వాళ్ళ అందరిని చూసుకునేది అంటా, అలా తల్లి కష్టపడితే వాళ్ళకి అన్నం తినడానికి దొరికేది, ఇక ఎప్పుడైతే తల్లికి కూడా అనారోగ్యం, తాను కూడా పని చెయ్యటం మానేసింది.. అని తెలిసి గీతా గారు సినిమా ఇండస్ట్రీ లో ఎవ్వరు తెలవకపోయినా, ధైర్యంతో పట్టుదలగా అవకాశాలని అందిపుచ్చుకున్నది అంటా.

ఇక వాళ్ళ అన్నయ్య కూడా చనిపోవడంతో వాళ్ళ పిల్లలు కూడా ఆనాధలు అవుతే గీతా గారే పోషించేవారు. ఇలా తమ బాధలని ఇంకా చెప్పుకుంటూ బాగా కన్నీరు పెట్టుకున్నారు. అవి చూసిన ప్రేక్షకులు ఆమె బాధ వర్ణనాతీతం అని ఆమెకి నీరాజనాలు పలుకుతున్నారు.

అంత చిన్న వయసులో పెళ్లి చేసుకోకుండా తన బాధ్యతగా తల్లిని, అన్నయ్య పిల్లలని చూసుకోవటం నిజంగా గొప్పే కదా… కానీ తనకి ఒక పక్క సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి, ఏం చేస్తుందో ఏమో చూద్దాం.