బాహుబలి రికార్డ్ ని బద్దలు కొట్టిన చరణ్


charan beats baahubali records in japanజపాన్ లో బాహుబలి వన్ మిలియన్ డాలర్లకు పైగా వసూల్ చేయగా చరణ్ ఆ రికార్డ్ ని బద్దలు కొట్టాడు మగధీర చిత్రంతో . 2009 లో తెలుగునాట విడుదలై ప్రభంజనం సృష్టించిన చిత్రం ” మగధీర ” . కాగా ఇన్నేళ్ల తర్వాత మగధీర చిత్రాన్ని జపాన్ లో డబ్ చేసారు , అయితే మగధీర సినిమా బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి మరింత ముందుకు దూసుకుపోతోంది . జపాన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ కు అలాగే ప్రభాస్ కు ఎన్టీఆర్ కు మంచి మార్కెట్ ఏర్పడింది . ఇక రజనీకాంత్ చిత్రాలకు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సినిమా ఎలా ఉన్నప్పటికీ వసూళ్ల వర్షం కురుస్తోంది .

ముత్తు సినిమా అక్కడ ప్రభంజనం సృష్టించింది , ఆ సినిమాతోనే జపాన్ లో రజనీకాంత్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది . ముత్తు సినిమా ఆరోజుల్లోనే వన్ అండ్ హాఫ్ మిలియన్ డాలర్ల ని వసూల్ చేసింది , కాగా ఇప్పుడు ఆ రికార్డ్ ని చరణ్ మగధీర బద్దలు కొట్టేలా ఉంది ఎందుకంటే ఆల్రెడీ బాహుబలి రికార్డ్ ని బద్దలు కొట్టాడు ఇక ఇప్పుడున్నది రజనీకాంత్ ముత్తు రికార్డ్ మాత్రమే ! చరణ్ – కాజల్ అగర్వాల్ నటించిన మగధీర కు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే .

English Title: charan beats baahubali records in japan